CCT క్యాన్సర్ స్క్రీనింగ్.. ఫూల్స్‌ని చేశారుగా!
Response on CCT And Star Hospitals FREE CANCER SCREENING CAMPహైదరాబాద్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో సినీ పరిశ్రమలోని కార్మికులు, నటులు, సినీజర్నలిస్టులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లుగా రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టుగా రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవి ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి శిబిరం జూలై 9న ఆదివారం హైదరాబాద్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) వద్ద భారీగా నిర్వహించారు. అయితే పేరుకే భారీ కానీ.. అక్కడ స్ర్కీనింగ్ మాత్రం ఏమీ జరగలేదు. అసలు స్ర్కీనింగ్ మిషన్‌ని అక్కడ ఏర్పాటు చేశారో లేదో కూడా తెలియనంతగా ఈ క్యాంప్‌తో జర్నలిస్ట్‌లని స్టార్ హాస్పిటల్స్ వారు ఫూల్స్‌ని చేశారు.
మాములుగా చిరంజీవి చెప్పిన ప్రకారం.. లక్షణాలు ఉన్నా, లేకపోయినా.. ముందస్తు జాగ్రత్తలు పాటించడం కోసం ప్రతి ఒక్కరికీ స్ర్కీనింగ్ చేయించుకోవడం మంచిదని, అందుకే ఎంత ఖర్చు అయినా.. ఇది చేయిస్తానని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఫారెన్‌లో ఉన్నారు. ఆయన అందుబాటులో లేకపోయినా.. మెగాబ్రదర్ నాగబాబు, రవణం స్వామినాయుడు వంటి వారు స్టార్ వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి క్షేమం కోరుకునే మెగాస్టార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి.. సినీ పరిశ్రమలోని కార్మికులు, నటులు, సినీజర్నలిస్టులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ అక్కడ జరిగిన పరీక్షలతో డిజప్పాయింట్ అయినట్లుగా.. టెస్ట్ చేయించుకున్న ప్రతి ఒక్కరి నోటి వెంట వినిపిస్తుండటం గమనార్హం.
ఎందుకిలా అంటే.. ఒక పేపరు ఇచ్చి.. మీకు అది ఉందా? ఇది ఉందా? అని టిక్స్ పెట్టుకుని.. తర్వాత డాక్టర్ దగ్గరకు పంపించగా.. ఆయన ఒక చెక్క పుల్లని నోట్లో పెట్టి అటు ఇటు తిప్పి.. అంతా నార్మల్ అని పంపించడం తప్పితే.. స్క్రీనింగ్ పరంగా మాత్రం ఏం జరగలేదు. పేపర్‌లో ఏదైనా రాంగ్ టిక్ ఉంటే.. ‘మీరు నానక్ రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కి రండి. అక్కడ ఈ పరీక్షలు చేస్తారు. అందుకు మీకు 50శాతం డిస్కౌంట్ ఉంటుంది’ అని డాక్టర్‌తో చెప్పించారు. అంతే తప్ప.. అక్కడ స్ర్కీనింగ్ మాత్రం జరగలేదని తెలుస్తోంది. దీంతో ఈ శిబిరానికి హాజరైన వారంతా.. ఇంతోటి దానికి ఇంత అవసరమా? అనుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం మెగాస్టార్‌కి తెలుసో? లేదో? తెలియదు కానీ.. ఇంతకు ముందు సుమ కనకాల కొందరికి ఇలానే క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలను ఉచితంగా చేయించారు. దాదాపు 50 మందికి ఆమె స్ర్కీనింగ్ పరీక్షలు చేయించగా.. అందులో ఐదారుగురికి క్యాన్సర్ ఉన్నట్లుగా డిటెక్ట్ అయింది. అలాగే ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారనుకుని అంతా ఈ శిబిరానికి హాజరవగా.. ఒక పేపరు, ఒక చెక్కపుల్లతో తిప్పడం తప్పితే.. అక్కడ చేసింది ఏమీ లేదు? అది విషయం.
FREE CANCER SCREENING CAMP organized by Chiranjeevi Charitable Trust (CCT) in association with Star Hospitals Disappointed






































