Advertisementt

ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి: సమంత

Mon 10th Jul 2023 11:52 AM
samantha  ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి: సమంత
Samantha Shares A Cryptic Post On Her Instagram ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి: సమంత
Advertisement
Ads by CJ

సమంత గత ఏడాది కాలంగా మాయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తుంది. ఆరు నెలల క్రితం మాయోసైటిస్ నుండి కోలుకుని మెల్లగా షూటింగ్స్ లో బిజీ అయిన సమంత.. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చింది. ఎప్పటిలాగే సినిమాలు, జిమ్ లో వర్కౌట్స్ అంటూ హడావిడి పడుతుంది అని ఆమె అభిమానులు అనుకున్నారు. కానీ తాజాగా సమంత ఓ ఏడాది పాటు సినిమాలకి విరామం ప్రకటించబోతుంది అనే షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈఏడాది కాలం సమంత తన ఆరోగ్యంపై శ్రద్ద పెట్టనుంది అని అంటున్నారు.

సమంత తాను ఏడాది పాటు బిగ్ బ్రేక్ ఇవ్వబోతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టకుండా.. అది నిజమే అన్నట్టుగా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలంగా మారింది. మరో మూడు రోజులు మాత్రమే ఈ కారా వ్యాన్ లో ఉండేది.. గత ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పల్సాల్సిన సమయం వచ్చేసింది అంటూ పెట్టిన పోస్ట్ చూసిన అభిమానులు అయితే సమంత విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా నిజమే. ఆమె ఏడాది పాటు బిగ్ బ్రేక్ ఇవ్వబోతుంది అని అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.

సమంత రీసెంట్ గానే విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసింది. అది సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుంది. అలాగే ముంబైలో సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటుంది. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపై సమంత మరో మూడు రోజులు షూటింగ్ చేసి ప్యాక్ చెప్పేసి అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతుంది. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టింది అని అభిమానులు అనుకుంటున్నారు.

సమంత ఇంకా తన అనారోగ్యంతో పోరాడుతుంది. దానికోసమే ఆరు నెలల పాటు ఆమె అమెరికా వెళ్లబోతుంది. అక్కడే ఆరోగ్యంపై ఆమె పూర్తి శ్రద్ద పెట్టబోతోంది అంటున్నారు. రీసెంట్ గా సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లోముఖానికి మాస్క్ మరియు క్యాప్‌తో కప్పుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Samantha Shares A Cryptic Post On Her Instagram:

Samantha shares last 6 months have been Longest and hardest for her in cryptic post

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ