Advertisementt

రిలాక్సేషన్ కోసం USAకి నిఖిల్

Mon 10th Jul 2023 11:27 AM
nikhil  రిలాక్సేషన్ కోసం USAకి నిఖిల్
Nikhil chilling in the US రిలాక్సేషన్ కోసం USAకి నిఖిల్
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియాలో భారీ హిట్ కొట్టి రీసెంట్ గా స్పై మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ ఆ చిత్రంతో ఆడియన్స్ ని నిరాశపరిచాడు. కార్తికేయ 2 బిగ్గెస్ట్ హిట్ అవడంతో స్పై కి భారీ ఓపెనింగ్స్ రావడమే కాదు.. వారం తిరిగే సరికి నెగెటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకుంది. అయితే స్పై తో ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయలేకపోయిన నిఖిల్ ఆడియన్స్ కి, అభిమానులకి, ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి సారి చెప్పాడు. ఈసారి కంటెంట్ ఉన్న సినిమాతోనే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా మూవీస్ తో అనుకున్న సమయానికే వస్తానంటూ ప్రామిస్ చేసాడు.

అయితే స్పై మూవీ ప్రమోషన్స్, రిలీజ్, ప్లాప్ టాక్ తో సతమతమయిన నిఖిల్ ఇప్పుడు రిలాక్సేషన్ కోసం అమెరికా వెళ్ళిపోయాడు. Recharging the Batteries 💥🔥 #USA #chilling అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసాడు. నిఖిల్ తాను USA లో ఉన్నాను, బ్యాటరీ రీఛార్జ్ చెయ్యాలి, అమెరికాలో ఛిల్ అయ్యి వస్తాను అన్నట్టుగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే నిఖిల్ సోలోగా.. కూల్ గా కనిపిస్తున్న వైట్ అండ్ వైట్ లుక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక నిఖిల్ వెకేషన్ పూర్తి చేసుకుని రాగానే తన తదుపరి ప్రాజెక్ట్స్ షూటింగ్ లో బిజీగా  అవుతాడని తెలుస్తుంది.

అయితే నిఖిల్ కొన్నాళ్లపాటు కొత్త దర్శకులు, నిర్మాతలతో సినిమాలు చెయ్యనని స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాస్త పేరున్న, అనుభవం ఉన్న దర్శకనిర్మాతలతోనే ఆయన ఇకపై సినిమా చేస్తాను అన్నట్టుగా చెప్పాడు.

Nikhil chilling in the US:

Nikhil recharging himself

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ