నందమూరి నటసింహం బాలయ్య పేరు వినగానే ఆయన అభిమానుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అదే సమయంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆయనని ట్రోల్ చేయడానికి ఏ చిన్న విషయం దొరుకుతుందా? అని చూస్తుంటారు. అభిమానులు హద్దు మీరినప్పుడు.. బాలయ్య తన చేతికి పని చెబుతాడనే విషయం తెలియంది కాదు. అయినా ఫ్యాన్స్ దానిని చాలా గొప్పగా తీసుకుంటారు. ఆ మధ్య దీనికి సాయిమాధవ్ బుర్రా కూడా వివరణ ఇచ్చారు. గన్‌మెన్‌లతో, బాడీగార్డ్‌లతో ఏం కొట్టించడం లేదు.. తన అభిమానులను తనే బిడ్డల్లా భావించి అలా భయం చెబుతున్నాడనేలా.. ఈ కొట్టడంపై క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి కొట్టే కార్యక్రమంపై బాలయ్యని ట్రోల్ చేసే వారంతా.. కాస్త ఆలోచించడం మొదలెట్టారు. అయితే ఆయన కొట్టినా, తిట్టినా.. బాలయ్యపై అభిమానం మాత్రం అభిమానుల్లో ఇసుమంత కూడా తగ్గదు అనేదానికి ఉదాహరణ ఇది. ఏంటంటే..
మాములుగా అభిమానులకు హీరోలు గిఫ్ట్‌లివ్వడం చూసుంటారు. కానీ ఓ వీరాభిమాని ఏకంగా బంగారు కానుకను బాలయ్యకు ఇచ్చి.. తన అభిమానం చాటుకున్నాడు. ఈ నటసింహాన్ని ఎంతగా అభిమానులు ఆరాధిస్తారో అనేది మరోసారి చాటి చెప్పాడు. లయన్ బాలయ్య పౌరుషానికి ప్రతీక. అందుకే.. ఆ పేరు కలిసేలా.. తన సినిమాలకు పేర్లు సెట్ చేయమని చెబుతుంటారు. పాతరోజుల్లో ఏమోగానీ.. ఇప్పుడొస్తున్న బాలయ్య సినిమా టైటిల్స్‌లో మ్యాగ్జిమమ్ సింహం అనే పదం ఉండాల్సిందే. అలాంటి సింహపు ఉంగరాన్ని అభిమాని బాలయ్యకు గిఫ్ట్‌గా ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అమ్మ అరిసిందనో.. నాన్న తిట్టాడనో బాధపడితే పైకి రాలేం. ఇక్కడ బాలయ్య కూడా వారి అభిమానులకు అంతే. ఫ్యాన్స్ అన్నాక కూసింత క్రమశిక్షణ ఉండాలనేది ఆయన తత్వం. అందుకే అప్పుడప్పుడు తన పెద్దరికం చూపెడుతుంటారు. సరే.. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేస్తున్న నటసింహం.. తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీతో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది.