Advertisementt

రాజమౌళి సినిమా కోసం మహేష్ ట్రైనింగ్

Sun 09th Jul 2023 09:29 PM
mahesh babu  రాజమౌళి సినిమా కోసం మహేష్ ట్రైనింగ్
Mahesh Babu In Rigorous Training For 3 Months రాజమౌళి సినిమా కోసం మహేష్ ట్రైనింగ్
Advertisement
Ads by CJ

సున్నితమైన మహేష్ బాబు రాజమౌళి చేతిలో పడితే.. ఏమైపోతాడో.. అందమైన మహేష్ రాజమౌళి సినిమా చేస్తే తెగ కష్టపడాలి. రాజమౌళితో సినిమా అంటే ఫుడ్ బాల్ ఆడినట్టే. మరి మహేష్ బాబు ఎంత మాస్ గా కనిపించినా సున్నితంగానే ఉంటారు. రాజమౌళి అలా కాదు. అటు ఇటు లాగిపారేస్తారు. అందుకే రాజమౌళితో మహేష్ చెయ్యబోయే SSMB29 పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. అయితే ప్రసుతం రాజమౌళి-మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ మొదలైనట్టుగా రాజమౌళి ఫ్యామిలీ నుండి వస్తున్న సమాచారం.

అయితే రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. రాజమౌళి-మహేష్ మూవీ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది. దీనిని బట్టి మహేష్ గట్టిగానే యాక్షన్ చెయ్యాల్సి వస్తుందట. దాని కోసం మహేష్ కొద్దిరోజుల పాటు శిక్షణ తీసుకోబోతున్నాడట. మహేష్ చెయ్యబోయే పాత్ర తాలూకు ట్రైనింగ్, లుక్ టెస్ట్ ఇలా అన్ని ఈ ట్రైనింగ్ పిరియడ్ లోనే ఉండబోతున్నాయట. ఈ శిక్షణ మూడు నెలలపాటు ఉండబోతుంది అని, నవంబర్, డిసెంబర్, జనవరి లలో ఉండే ఛాన్స్ ఉందట.

అందుకే మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం ఈ నాలుగు నెలలో ఫినిష్ చెయ్యాలని చూస్తున్నారట. నవంబర్ కల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ మహేష్ రాజమౌళి మూవీ కోసం వచ్చేయ్యాల్సి ఉంటుందని అందుకే మహేష్ కూడా ప్రస్తుతం హడావిడి పడుతున్నాడని అంటున్నారు. 

Mahesh Babu In Rigorous Training For 3 Months:

Three months of training for Mahesh Babu

Tags:   MAHESH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ