సెన్సేషనల్ సలార్ మూవీ టీజర్ రీసెంట్ గా విడుదలైన రికార్డ్ వ్యూస్ సాధించింది. ఇప్పటికీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆదిపురుష్ తో ప్రభాస్ ఇమేజ్ కి వచ్చిన డ్యామేజ్ సలార్ కవర్ చేసేస్తుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మాస్ ఎలివేషన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ మాస్ కటౌట్ చూసి ఫ్యాన్స్ కేకలు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని చూపించిన తీరుకి సలార్ పై విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. సలార్ టీజర్ మాస్ ఎలివేషన్ తో పెరిగిన అంచనాలతో ఇప్పుడు సలార్ ధియేటరికల్ బిజినెస్ కి భారీ డిమాండ్ మొదలైంది.
అయితే ఈ చిత్రంలో ఓ కామెడీ పాత్ర వేసిన కమెడియన్ సప్తగిరి తాజాగా సలార్ డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా అప్ డేట్ ఇవ్వడమే కాకుండా.. సలార్ పై ప్రస్తుతం ఉన్న హైప్ ని మరింతగా పెంచేసాడు. సలార్ 2000 కోట్లు మూవీ. ఈ మూవీ ఖచ్చితంగా బాక్సాఫీసు దగ్గర సునామి సృష్టిస్తుంది. 2000 కోట్లు కొల్లగట్టడం ఖాయమంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ రేంజ్ అంచనాలతో సెప్టెంబర్ 28 న సలార్ పార్ట్ 1 క్రియేట్ చెయ్యబోయే రికార్డ్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు.
పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఏడెనిమిదిమంది విలన్స్ కనిపిస్తారట. అందులో జగపతి బాబు లాంటి విలక్షణ నటులు కూడా ఓ నెగెటివ్ రోల్ పోషించారు. ఇంకా ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది.