గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తొమ్మిదినెలల ప్రెగ్నెంట్. తాను తల్లి కాబోతున్నా అంటూ అందరితో ఆనందకరమైన విషయాన్ని పంచుకున్నాను అనుకున్న ఇలియానాకి నెటిజెన్స్ మాత్రం ఆమె ఎవరిని పెళ్లాడిందో అన్న విషయంలో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యేలా చేసారు. అసలు ఇలియానా ఎవరిని వివాహం చేసుకుంది. ఎవరి వలన ప్రెగ్నెంట్ అయ్యింది అనే విషయంపైనే ఫోకస్ పెట్టారు. మధ్య మధ్యలో ఇలియానా తాను ఎవరితో రిలేషన్ లో ఉందో సగం సగం రివీల్ చేస్తూ వచ్చింది. కానీ ఇంతవరకు అతని పూర్తి విషయాలను బయటపెట్టలేదు.
బేబీ బంప్ ఫొటోస్ తో సందడి చేసే ఇలియానా ఇప్పుడు తొమ్మొదినెలల ప్రెగ్నెంట్ తో తాను ఎంతగా ఇబ్బంది పడుతుందో చెప్పి వాపోతుంది. తొమ్మిది నెలల గర్భంతో తాను ఎలాంటి పని చేయలేకపోతున్నాను అని, నిద్ర పోవడానికి ఇబ్బందిగా ఉండడమే కాదు.. చాలా నీరసంగా ఉంటుంది అంటూ అంటూ ఓ పిక్ ని కూడా షేర్ చేస్తూ ఇలియానా ఇన్స్టాలో రాసుకొచ్చింది. మరి గర్భంతో ఉన్న ప్రతి తల్లి పడే బాధే ఇలియానాకి ఎదురవుతుంది. అవన్నీ దాటుకుని బిడ్డని చేతుల్లోకి తీసుకునే వేళ పడిన బాధలు, ఇబ్బందులు అన్ని మర్చిపోయి సంతోషాలను ఆస్వాదిస్తారు. నువ్వు కూడా త్వరలోనే ఆ ఆనందాన్ని పొందుతావు.. ఈ బాధ ఇంకా ఎన్నిరోజులో ఉండదులే అంటూ నెటిజెన్స్ ఇలియానాకి ధైర్యం చెబుతున్నారు.