నిన్నటివరకు విడాకుల విషయంలో దోబూచులాడిన నిహారిక కొణిదెల ఇప్పుడు తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయినట్లుగా అధికారికంగా ప్రకటించడమే కాదు.. కామెంట్స్ బాక్స్ క్లోజ్ చేసి కాస్త ప్రయివసీని కోరుకుంటున్నట్టుగా చెప్పింది. గత ఆరు నెలలుగా తండ్రి ఫ్యామిలీతోనే కలిసి ఉంటున్న నిహారిక అప్పటినుండే తన భర్తకి దూరంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ తో కలసి గోవాకి రిలాక్సేషన్ కోసమని వెళుతుంది. ఇక ఈమధ్యన డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక ఇకపై యాక్టింగ్ తో బిజీ కాబోతున్నట్లుగా తెలుస్తుంది.
నిహారిక విడాకుల విషయం సోషల్ మీడియాలో షేర్ చేసాక మళ్ళీ ఇప్పుడు.. ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోతో పాటుగా ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో నలుగురు అమ్మాయిలు ఇలా ఉంటారంటూ ఓ వాయిస్ వినిపించింది. అందులో నిహారిక తన గురించి మట్లాడుతూ ఒక అమ్మాయి బెటర్ డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఇష్టపడుతుంది. మరొకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తారు. కానీ ఇంకొకరు రెడీ అయేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించరు.
చివరిగా ఓ మహాతల్లి ఉంటుంది.. అసలెప్పుడూ కనిపించదు అంటూ ఓ ఫన్నీ ఎమోజిని షేర్ చేసింది. ఆ వీడియోలో మహాతల్లి ఫేమ్ కూడా కనిపించింది. ఇక విడాకుల తర్వాత నిహారిక డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఇలా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఎంజాయ్ చేస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.