జూన్ చివరి వారంలో విడుదలైన శ్రీవిష్ణు నటించిన సామజవరగమన మూవీ అనూహ్యమైన ఫ్యామిలీ హిట్ గా నిలిచింది. నిఖిల్ స్పై కి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో సామజవరగమన కి కామెడీ వర్కౌట్ అవడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. శ్రీ విష్ణు కెరీర్ లోనే సామజవరగమనకి బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. వారం తిరిగేలోపు 30 కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చి మేకర్స్ నెత్తిన పాలు పోసింది. ఏజెంట్ విషయంలో విలవిలలాడిన నిర్మాత అనిల్ సుంకర సామజవరగమన హిట్ తో తేరుకున్నారు.
అయితే ఈవారం ఆరు సినిమాలు విడుదలవడంతో సామజవరగమన సినిమా కలెక్షన్స్ పడిపోతాయనే అనుకున్నారు. కానీ శ్రీవిష్ణు సామజవరగమనకి ఈ వారం కూడా అలా అలా కలిసొచ్చేసింది. కారణం నిన్న శుక్రవారం విడుదలైన సినిమాలేవీ హిట్ ట్రాక్ లోకి రాలేదు. నాగ శౌర్య రంగబలి హిట్ అన్నారు కానీ.. కలెక్షన్స్ రాలేదు. అందులోను రంగబలికి పూర్ రివ్యూస్ రావడం దానికి మైనస్ గా మారింది.
ఇక రుద్రంగి కి హిట్ టాక్ వచ్చింది. మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ ఆ సినిమాకి కలెక్షన్స్ రావడం లేదు. కారణం స్టార్స్ లేకపోవడం.. జగపతి బాబు ఉన్నారు. కానీ ఆయన కోసం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక భాగ్ సాలే భరించలేమంటున్నారు. అలాగే 7.11 PM అలానే ఉంది, మిగిలిన సర్కిల్, ఓ సాతియా సినిమాలు చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఈ వారం రంగబలి పుంజుకుంటే సామజవరగమనాకి దెబ్బ పడేదే.
కానీ రంగబలి కూడా ప్లాప్ లిస్ట్ లోకి చేరడంతో సామజవరగమన కి దూకుడు పెరిగేలా ఉంది. దానితో ఆయన ఫాన్స్ రెండో వారం కూడా మనదే శ్రీవిష్ణు రెచ్చిపో అంటూ కామెంట్ చేస్తున్నారు.