పుష్ప ప్యాన్ ఇండియా మూవీతో నార్త్ లో గ్రాఫ్ పెంచుకున్న అల్లు అర్జున్ పుష్ప ద రూల్ తో అది పదింతలు చేసే ప్లాన్ చేసుకోవడమే కాదు.. దాని కోసం బాలీవుడ్ లో మంచి పీఆర్ టీమ్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. అలాగే పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీని ప్రకటించిన అల్లు అర్జున్ రీసెంట్ గా తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ తో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించాడు. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ తో కలిసి టీడీపీ నేత ముంటిమడుగు కేశవరెడ్డి ఫామ్ హౌస్ లో విందుకి హాజరయ్యాడు.
అల్లు అర్జున్ ప్రత్యేకంగా కేశవరెడ్డి ఫామ్ హౌస్ కి వెళ్ళలేదు. అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శుక్రవారం కారులో వెళుతూ మార్గమధ్యలో గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద ఉన్న కేశవరెడ్డి ఫామ్ హౌస్ కు వచ్చారు. అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ కి కేశవరెడ్డి, ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి స్వాగతం పలికారు. అంతేకాకుండా అల్లు అర్జున్ రాయలసీమ రుచులతో విందు భోజనం పెట్టారు.
మరి అల్లు అర్జున్ వచ్చాడనే విషయం తెలియగానే ఫామ్ హౌస్ కు జనాలు పోటెత్తారు. ఇక విందు కార్యక్రమం పూర్తి కాగానే అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ అంతా బెంగుళూరుకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.