టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా వెలిగిపోతున్న తార శ్రీలీల. ప్రస్తుతం డే అండ్ నైట్ కష్టపడుతూ షూటింగ్స్ కి హాజరవుతున్న శ్రీలీల్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండదు. అందరిలా వయ్యారాలు పోతూ ఫోటో షూట్స్ చేయించుకోదు. రెండు సినిమాలకే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ మొత్తాన్ని తన వెనక తిప్పుకుంటున్న శ్రీలీల కి యంగ్ హీరోలే కాదు.. ఇద్దరి స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం ఆమె అదృష్టానికి పరాకాష్ట. మహేష్-పవన్ కళ్యాణ్ చిత్రాల్లో శ్రీలీల నటించడం ఆమె లక్ అనే చెప్పాలి.
యంగ్ హీరోలైన రామ్, వైష్ణవ తేజ్, నితిన్, విజయ్ దేవరకొండ లతో రొమాన్స్ చేస్తున్న శ్రీలీల.. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులని పలకరించబోతుంది. అందులో రామ్ తో నటిస్తున్న స్కంద, బాలయ్య భగవంత్ కేసరి ఈ రెండు చిత్రాలూ ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. ఇక మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చే ఏడాది బోణి కొట్టబోతుంది. అయితే శ్రీలీల ఎక్కువగా గ్లామర్ షో చెయ్యదు. ఏ ఈవెంట్ లో కనిపించినా పద్ధతిగా చుడి దార్లు లోనో శారీస్ లోనో కనిపిస్తుంది.
తాజాగా శ్రీలీల మోడ్రెన్ లుక్ గ్లామర్ షో చేసింది. క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ టీ షర్ట్ లో బెడ్ మీద కూర్చుని అందాలు ఆరబోసింది. మరీ అందాలు చూపించకపోయినా శ్రీలీల గ్లామర్ మాత్రం హైలెట్ అయ్యింది. లూజ్ హెయిర్ తో కొంటె చూపులతో మత్తెక్కించింది. ప్రస్తుతం శ్రీలీల గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.