సీనియర్ హీరోలు బాలకృష్ణ-చిరంజీవి ఇద్దరూ తమ తమ భార్యలతో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కేసారు. ఇద్దరూ ఒకేసారి యుఎస్ కి ప్రయాణమవ్వకపోయినా.. ఇద్దరూ ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. నందమూరి బాలకృష్ణ రెండురోజుల క్రితం భార్య వసుంధర చిన్న కుమర్తె తేజస్విని కుమారుడు అంటే తన చిన్న మనవడితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ బాలయ్య మనవడితో కలిసి తన సభల్లో పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరు నిన్న భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు.
ఆయన చిన్నపాటి వెకేషన్ కోసం అమెరికా వెళ్ళినట్లుగా చెప్పారు. కాస్త రిఫ్రెష్ అయ్యి వచ్చి తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ లో పాల్గొంటానని చెప్పారు. అలా మెగాస్టార్-బాలయ్య ఇద్దరూ భార్యలతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య అక్కడి నుండి రాగానే భగవంత్ కేసరి షూటింగ్ లో పాల్గొంటారు. బాలయ్య కుడా త్వరగానే యుఎస్ ట్రిప్ ముగించుకుని వస్తారని తెలుస్తుంది. ఎందుకంటే భగవంత్ కేసరి-బాబీ మూవీ షూటింగ్స్ చెయ్యాలి. అలాగే అటు పొలిటికల్ గాను బాలయ్య బిజీ కాబోతున్నారు.
ఇక మెగాస్టార్ భోళా శంకర్ షూటింగ్ ఫినిష్ చేసేసారు. డబ్బింగ్ కూడా పూర్తి కావడంతో ప్రమోషన్స్ కి సమయం దొరకడంతో ఈ చిన్న గ్యాప్ లో ఆయన యుఎస్ కి వెళ్లిపోయారు. భార్యతో అక్కడ కొన్నాళ్ళు సేదతీరి హైదరాబాద్ వచ్చి భోళా శంకర్ ప్రమోషన్స్ తో పాటుగా తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు.