Advertisementt

నయన్-విగ్నేష్ పై మరో కేసు

Sat 08th Jul 2023 09:05 AM
vignesh shivan,nayanthara  నయన్-విగ్నేష్ పై మరో కేసు
Another case on Nayan-Vignesh నయన్-విగ్నేష్ పై మరో కేసు
Advertisement
Ads by CJ

నయనతార-విగ్నేష్ శివన్ లు గత ఏడాది జూన్ లో వివాహం చేసుకున్న తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి మాఢవీధులో చెప్పులు ధరించి తిరిగారంటూ అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దానితో టీటీడీ వారు నయనతార దంపతులపై చర్యలకి సిద్దమవగా.. విగ్నేష్ వారికి సారీ చెప్పి తపించుకున్నారు. ఆ తర్వాత ఈ జంటని సరోగసి వ్యవహారం వెంటాడింటి. అది కూడా నయన్-విగ్నేష్ లు లీగల్ గా పరిష్కరించుకున్నారు. నయనతార-విగ్నేష్ శివన్ లు ప్రస్తుతం తమ కవల పిల్లలతో సంతోషంగా గడుపుతూ తమ కెరీర్ ని మలుచుకుంటున్నారు.

అయితే నయన్-విగ్నేష్ జంటపై ఇప్పుడొక కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. అది విగ్నేష్ శివన్ బాబాయ్.. విగ్నేష్ శివన్ అలాగే నయనతార, విగ్నేష్ అమ్మగారు, చెల్లెలిపై కేసు పెట్టారు. కారణమేమిటి అంటే విగ్నేష్ శివన్ తండ్రి అన్నదమ్ములు తొమ్మిదిమంది. తమ పూర్వీకుల ఆస్తిని విగ్నేష్ శివన్ తండ్రి ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేరే వారికి విక్రయించారంటూ విగ్నేష్ బాబాయిలు ఇద్దరు ఇప్ప్పుడు పోలీస్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రస్తుతం విగ్నేష్ శివన్ తండ్రి చనిపోయినా.. అలా ఆయన మోసపూరితంగా విక్రయించిన భూమిని మళ్ళీ విగ్నేష్ తమకి కొని ఇవ్వాలంటూ ఆయన ఫిర్యాదు చేసారు.

విగ్నేష్ బాబాయిలు.. విగ్నేష్ శివన్ అలాగే ఆయన వైఫ్ నయనతారపై, విగ్నేష్ శివన్ తల్లి, చెలిపై కేసు పెట్టారు. తిరుచ్చి ఎస్పీ కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చలకు దారితీసింది.

Another case on Nayan-Vignesh:

Police case filed against Vignesh Shivan and Nayanthara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ