Advertisementt

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ యాంకర్

Fri 07th Jul 2023 09:25 PM
jabardasth anchor sowmya rao  స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ యాంకర్
Jabardasth Anchor Sowmya Rao Gets Emotional స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ యాంకర్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కి అనసూయ ప్లేస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ సౌమ్య రావు వచ్చి రాని తెలుగులోనే.. అదిరిపోయే గ్లామర్ షో తో స్టేజ్ పై కమెడియన్స్ తో డాన్స్ చేస్తూ జెడ్జ్ ఇంద్రజతో కలిసి డాన్స్ స్టెప్స్ తో బాగానే అల్లుకుపోయింది. అప్పుడప్పుడు కామెడీ పంచ్ లకి నవ్వేస్తూ.. వచ్చిరాని తెలుగుతో నవ్వించే సౌమ్య రావు ఈ మధ్యన పర్సనల్ లాస్ అయ్యింది. ఆమె తల్లి బ్రెయిన్ క్యాన్సర్ తో కన్ను మూయగా.. ఆ విషయాన్ని రీసెంట్ గా ఓ వీడియో షేర్ చేస్తూ తన బాధని బయటపెట్టింది.

జులై 9 వచ్చే ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై హైపర్ ఆది గిఫ్ట్ ఇస్తానంటూ సౌమ్య రావు ని స్టేజ్ మీదకి పిలిచి ఆమె తల్లి ఫోటో ని గిఫ్ట్ ఇవ్వగానే సౌమ్య రావు కన్నీటి పర్యంతమైంది. వెనుకగా సౌమ్య రావు తల్లి చివరి క్షణంలో తీసుకున్న వీడియో కనిపించింది. దానితో సౌమ్య రావు బాధపడుతూ.. తన తల్లికి హెడేక్ వస్తుంది అని తెలిసి హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. అక్కడ ఆమె తల్లికి డాక్టర్స్ బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత మూడేళ్లు పాటు ఆమె తల్లి బెడ్ పైనే నరకం చూసినట్లుగా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.

సౌమ్య రావు తన తల్లిని తలుచుకుంటూ అమ్మ మళ్ళీ నా పొట్టలో పుట్టాలని కోరుకుంటున్నా అంటూ ఏడవడం చూసిన శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళ నీళ్లతో కనిపించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Jabardasth Anchor Sowmya Rao Gets Emotional:

Jabardasth Anchor Sowmya Rao Gets Emotional Remembering Her Mother

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ