దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ షెడ్యూల్ అంటూ హడావిడి చేయడమే కానీ అది ఇప్పుడప్పుడే మొదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోనే ఏపీకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానితో ఆయన రాజాజీయంగా బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన BRO కి డబ్బింగ్ చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైతే దాని పనైపోతుంది. మధ్య మధ్యలో సుజిత్ తో చేస్తున్న OG కి డేట్స్ ఇస్తూ వెళుతుంటే అటు రాజకీయాలు, ఇటు సుజిత్ OG పూర్తవుతుంది.
ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వరనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరోపక్క హరి హర వీరమల్లు ఆగిపోయిందా.. లేదంటే త్వరలో పట్టాలెక్కుతుందా అనేది ఆ దేవుడికే తెలియాలి. గత ఏడాది డిసెంబర్ లో ఆగిన వీరమల్లు షూటింగ్ ఇన్నిరోజులు గడుస్తున్నా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకోలేదు. ఇప్పుడు హరీష్ శంకర్ పరిస్థితి కూడా అదే అవుతుంది అంటున్నారు. కానీ హరీష్ శంకర్ మాత్రం మధ్య మధ్యలో అంటే ఇప్పటికే రెండుసార్లు ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ షెడ్యూల్ సూన్ అంటూ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ మళ్ళీ వారాహి తదుపరి యాత్ర షెడ్యూల్ ఏలూరు నుండి మొదటి పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ ఏడాది మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీదకి వెళ్లకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. హరీష్ శంకర్ ఎంతగా హడావిడి చేసిన ఇదే జరిగేది అనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.