ఈ నెలాఖరున అంటే జులై 28 న పవన్ కళ్యాణ్-సాయి తేజ్ లు BRO తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తర్వాత రెండు వారాల గ్యాప్ తో మెగాస్టార్ చిరు ఆగస్టు మంత్ కి బోణి కొట్టబోతున్నారు. ఆగష్టు 11 న మెగాస్టార్ భోళా శంకరుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ మ్యానియా ప్రేక్షకుల్లో మొదలైపోయింది. ఇక మెగాస్టార్ వచ్చిన వారానికే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఇప్పుడు ఆది కేశవ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
వైష్ణవ తేజ్-శ్రీలీల కాంబోలో క్రేజీ మూవీగా తెరకెక్కిన ఆది కేశవ్ మంచి డేట్ కోసం వెయిట్ చేసి చేసి చివరికి ఆగష్టు 18 న రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకుని ప్రకటన ఇచ్చారు. శ్రీకాంత్ N రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 18 న విడుదల కాబోతున్నట్లుగా డేట్ లాక్ చేసారు. ఇక వైష్ణవ తేజ్ వచ్చిన వారానికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సాఫీసు బరిలోకి వచ్చేందుకు ఎప్పుడో రెడీ అయ్యాడు. ఆగష్టు 25 న వరుణ్ తేజ్ గాండీవధార అర్జున తో రాబోతున్నాడు
మరి జులై 28 మొదలు పెట్టి ఆగష్టు 25 వరకు మెగా హీరోలు బాక్సాఫీసు మీద దాడికి రెడీ అయ్యారు. ఆగష్టులో అంటే ఒకే నెలలో ముగ్గురు మెగా హీరోలు చిరంజీవి-వైష్ణవ తేజ్-వరుణ్ తేజ్ లు ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యారు. మరి మెగా ఫాన్స్ అయితే వారం వారం మెగా సినిమాల జాతరలో తడిచి ముద్దవడం గ్యారెంటీ.