ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-క్రేజీ హీరో కమల్ హాసన్ కలయికలో బిగ్గెస్ట్ ప్యాన్ వరల్డ్ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ K హడావిడి మొదలవుతుందా అంటే.. మేకర్స్ అవుననే అంటున్నారు. నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కానీ.. ప్రాజెక్ట్ K సెట్స్ లోకి రీసెంట్ గానే కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చారు. అమితాబచ్చన్, దీపికా, దిశా పటాని భాగమయిన ఈ చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ అప్ డేట్ మేకర్స్ రివీల్ చేసారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె విడుదలకు ముందే అరుదైన గౌరవాన్ని అందుకుంది.
అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలు జూలై 19 నుంచి మొదలు కానున్నాయి. అయితే శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలతో ప్రాజెక్ట్ కే కి సంబంధం ఏమిటి అంటే.. జులై 20 న ఈ వేడుకల్లో ప్రాజెక్ట్ K టైటిల్ తో పాటు గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, నాగ్ అశ్విన్ తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ వేదికపై టైటిల్ అనౌన్స్ జరుగుతున్న మొదటి చిత్రంగా ప్రాజెక్ట్ కె నిలవనుంది.
ఈ విషయమై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ఇండియా కథలు చాలా గొప్పవి. ఇండియా అనేది సూపర్ హీరోలకు నిలయం. మా చిత్రం ప్రాజెక్ట్ K గురించి ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకు కామిక్ కాన్ సరైన గొప్ప వేదిక అనిపించింది.. అంటూ అసలు విషయాన్ని రివీల్ చేసారు.