యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈమధ్యన కెరీర్ లో కాస్త డౌన్ అయినా.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ క్యూట్ అండ్ బ్యూటీ ఫుల్ పిక్స్ ని వదులుతూ సందడి చేస్తుంది. వరసగా డిజాస్టర్స్ పలకరిస్తున్నా ఈ భామకి అవకాశాలు తగ్గటం అటుంచి ఆమెకి వరస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. రీసెంట్ గానే తమిళ్ ఫిల్మ్ ఓకె చేసింది. జయం రవి తో కలిసి కొత్త సినిమా పూజలో పాల్గొంది. అయితే ఇప్పుడు కృతి శెట్టిపై రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అది టాలీవుడ్ లోని ఓ వ్యక్తి కృతి శెట్టిని ఏడిపిస్తున్నాడని, టాలీవుడ్ హీరో గారి కొడుకు కృతి శెట్టి చుట్టూ తిరగడమే కాకుండా పలు ఈవెంట్స్ లో కృతి శెట్టిని వేధించడం, అలాగే రకరకాలుగా భయపెట్టడానికి చూసాడటంటూ కృతి శెట్టి ఈ మధ్యన ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. నిజంగానే కృతి శెట్టి శెట్టిని ఏడిపించిన ఆ హీరో కొడుకు ఎవరబ్బా అని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు.
ఈలోపు కృతి శెట్టి ఈ రూమర్స్ పై రియాక్ట్ అవడమే కాదు.. అవి నిజాలు కాదంటూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది.
ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చెయ్యొద్దు. తప్పుగా రాసి వాటిని ప్రచారం చెయ్యొద్దు.. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఎక్కడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు అంటూ కృతి శెట్టి చెప్పింది. అంతేకాకుండా గతంలో ఇలాంటి రూమర్స్ లైట్ తీసుకున్నా.. ఇప్పుడు అవే రూమర్స్ రోజు రోజుకి ఎక్కువవడంతోనే ఇప్పుడు తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.