మంచు మనోజ్ ఈఏడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. మనోజ్-మౌనికలు కొంతకాలంగా కలిసే ఉన్నప్పటికీ.. వారి పెళ్ళికి మోహన్ బాబు అంగీకారం దొరకని కారణంగానే వారు ఇన్నాళ్లు పెళ్ళి చేసుకోకుండా తండ్రి అనుమతి కోసం వెయిట్ చేసారని.. అసలు పెళ్ళికి కూడా మోహన్ బాబు సుముఖంగా లేకపోవడం వలనే మనోజ్ తన పెళ్లిని అక్క లక్ష్మి ఇంట్లో చేసుకున్నాడని అన్నారు. అయితే పెళ్ళిలో మోహన్ బాబు కనిపించారు. మౌనికని దగ్గరకి తీశారు. మంచు మనోజ్ పెళ్ళి వ్యవహారంలో అన్ని తానై నడిపించిన మంచు లక్ష్మి తాజాగా తమ్ముడి రెండో పెళ్ళి సీక్రెట్స్ రివీల్ చేసింది.
తన తండ్రి మోహన్ బాబు మనోజ్ పెళ్లిని ఒప్పుకోవాలని యాదగిరి గుట్టకి వెళ్లి లక్ష్మి నరసింహ స్వామిని వేడుకుందట. మనోజ్ పెళ్ళి నాన్న అంగీకారంతో నువ్వే చెయ్యాలని దేవుడికి మొరపెట్టుకుంది. మనోజ్-మౌనికలు పెళ్ళికి ముందు నా దగ్గరే ఉండేవారు. పెళ్లి తర్వాత విడిగా ఇల్లు తీసుకున్నారు. అయితే రెండు విభిన్న కుటుంబాల కలయికని నాన్న ఒప్పుకోవడంతో వారి పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత మనోజ్-మౌనికలని యాదగిరి గుట్ట తీసుకువెళ్లాను అంటూ మంచు లక్ష్మి తన తండ్రి మనోజ్ పెళ్ళికి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత అంగీకరించారనే విషయాన్ని బయటపెట్టింది.
ఇక తనకి పిల్లలు అంటే ఇష్టమని.. ఇద్దరు ముగ్గురు ఉంటే బావుంటుంది అనేది నా కోరిక. కానీ నాకు దేవుడు ఒక బిడ్డనే ఇచ్చాడని చెప్పిన మంచు లక్ష్మి పెళ్ళి తర్వాత మనోజ్-మౌనికలు వేరు కాపురం పెట్టారు. అక్కడికి వెళ్ళాక మౌనిక నాకు ఫోన్ చేసి అదెలా చెయ్యాలి ఇదెలా చెయ్యాలని అడుగుతుంది. కానీ నా దగ్గర ఉన్నప్పుడు అవేమి అడగలేదు.. నువ్వే చేసుకో పో అంటూ నేను టార్చర్ పెడుతున్నాను. నా కోసం మనోజ్ ఏమైనా చేస్తాడు అంటూ లక్ష్మి మనోజ్ రెండో పెళ్ళి వెనుక ఉన్న సీక్రెట్స్ రివీల్ చేసింది.