కంటెంట్ బలంగా ఉంటే విజయం సాధించొచ్చు, ఆడియన్స్ ని మెప్పించొచ్చు.. నిర్మాతలకు లాభాలను తీసుకురావొచ్చు అని చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తూ వచ్చాయి. గతంలో కార్తికేయ 2 అలాగే ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలై అనుకోకుండా హిట్ అయ్యి కూర్చుకుంది. కంటెంట్ బలంగా ఉంటే దానిని ఎవరూ ఆపలేరు అని కార్తికేయ 2 నిరూపించింది. తర్వాత విరూపాక్ష కూడా అలానే ప్రేక్షకుల్లోకి వెళ్లి 100 కోట్ల క్లబ్బుకి దగ్గరైంది. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చిన సామజవరగమన ఇప్పుడు పెద్ద హిట్ అయ్యింది
అనిల్ సుంకర నిర్మాతగా తెరకెక్కిన సామజవరగమన సినిమాలో హీరోగా శ్రీ విష్ణు నటించాడు. శ్రీ విష్ణు పెద్ద హీరో కాదు, భారీ బడ్జెట్ లేదు. అయినా కంటెంట్ బలంగా ఉండడంతో ప్రేక్షకుల్లోకి వెళ్ళింది. ప్రమోషన్స్ లోను పెద్ద జోరు లేదు అయినా సినిమా బాగా హిట్ అయ్యింది. వారం తిరిగేలోపులో సామజవరగమన 30.1 కోట్ల గ్రాస్ తో తన స్టామినా చూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవడంతో సామజవరగమన వీక్ డేస్ లోను మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది.
కంటెంట్ బలంగా ఉంటే ఖచ్చితంగా హిట్ కొట్టొచ్చని ఈ చిన్న చిత్రం మరోసారి నిరూపించింది. రేపు రాబోయే చిత్రాలేమైనా సామజవరగమన జోరుకి కళ్లెం వస్తే.. కలెక్షన్స్ తగ్గుతాయి..లేదు ఆ చిత్రాలేవీ ప్రేక్షకులని మెప్పించలేకపోతే మరో వారం సామజవరగమనదే అవుతుంది.