నిహారిక కొణిదెల విడాకుల మేటర్ ఇప్పుడు అఫీషియల్ అయ్యింది. నిన్నమొన్నటివరకు గాసిప్ గానే వినిపించిన ఈ విషయం ఇప్పుడు పబ్లిక్ అవడంతో నిహారిక సోషల్ మీడియా ద్వారా విడాకుల న్యూస్ పై క్లారిటీ ఇచ్చింది. తన భర్త చైతన్య తో అఫీషియల్ గా విడిపోతున్నానని, మేమిద్దరం పర్సనల్ లైఫ్ లో కాస్త ప్రైవసీని కోరుకుంటున్నట్లుగా తమని ఇబ్బంది పెట్టొద్దు అని, తనకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబెర్స్ కి, సన్నిహితులకు థాంక్స్ చెబుతూ కామెంట్స్ బాక్స్ క్లోజ్ చేసింది.
అయితే నిహారిక తన భర్త చైతన్య తో ఎప్పుడో విడిపోయింది అని, అంటే గత ఏడాది డిసెంబర్ లోనే వీరు విభేదాల కారణంగా విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారని తెలిసినా.. తాజాగానే వారి విడాకుల విషయం బయటికి వచ్చింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే అంటే జనవరిలో నిహారిక విడాకుల కోసం అప్లై చేసింది అని.. అవి ఇప్పుడు జులై లో మంజూరు అయినట్లుగా సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చైతన్య జొన్నలగడ్డ-నిహారిక విడిపోయి విడిగా ఉంటూనే విడాకులకు జనవరిలో అప్లై చేశారంటున్నారు.
ఇక పెళ్లిని అందరికి తెలిసేలా గ్రాండ్ గా చేసుకుని ఇప్పుడు విడాకుల విషయంలో ప్రైవసీ కావాలంటూ చెప్పడం చూసిన వారు నిహారికపై విమర్శలు చేస్తున్నారు. పెళ్లి అప్పుడు అన్నటిని సోషల్ మీడియా ద్వారా అందరికి షేర్ చేసి పబ్లిసిటీ చేసుకుని ఇప్పుడు విడాకుల విషయంలో ప్రైవసీ కావాలంటూ చెప్పడం విచిత్రంగా ఉంది అంటున్నారు.