లిల్లీ రివ్యూ...
నటీనటులు– బేబి నేహ, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ,
రాజ్‌వీర్, మిచెల్ షా, రాజీవ్ పిళ్లై, శివకృష్ణ తదితరులు..
బ్యానర్– గోపురం స్టూడియోస్
నిర్మాతలు– కె.బాబురెడ్డి, సతీష్ కుమార్.జి
సంగీతం– ఆంటో ఫ్రాన్సిస్
కథ– దర్శకత్వం– శివమ్
కథ..
లిల్లీ ( బేబి నేహ), దివ్య (ప్రణతి రెడ్డి), గూగుల్ (వేదాంత్ వర్మ) క్లాస్‌మేట్స్. అనుకోకుండా ఒకరోజు వారంతా ఆడుకుంటున్నప్పుడు ముక్కునుండి రక్తం కారటంతో సడెన్‌గా దివ్య కళ్లు తిరిగి కిందపడిపోతుంది. పిల్లలందరూ దివ్యకు ఏమైందో అని కంగారు పడుతూ దివ్యను పెంచిన మామయ్య దేవాకు (రాజ్‌వీర్) చెప్తారు. పాపను హాస్పిటల్‌కి తీసుకెళ్లిన దేవాకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అక్కడ నుండి అసలు కథ ప్రారంభం అవుతుంది. అసలు దివ్య అనే పాపకు ఏమైంది? లిల్లీ , వేదాంత్‌లు దివ్య కోసం ఏం చేశారు? చిన్న చిన్న పనులు చేసుకుని రోజులు గడుపుకునే దేవా పాపకి వచ్చిన కష్టాన్ని ఎలా తొలగించాడు? అనేది మిగిలిన కథ. ఈ కథలో లిల్లీ తాతయ్యగా నటించిన శివకృష్ణ ఏంచేశాడు? చివరికి పాప పరిస్థితి ఏంటి? అనేది మిగిలిన కథ.
ఎలా చేశారు–
ఐదుభాషల్లో పాన్‌ఇండియా చిల్డ్రన్ సినిమాగా విడుదలవుతున్న ‘లిల్లీ’ సినిమాను గోపురం స్టూడియోస్ పతాకంపై బాబురెడ్డి, సతీష్ కుమార్‌లు నిర్మించిన ఈ సినిమాకు శివమ్ నూతన దర్శకునిగా పరిచయం అయ్యారు. కడపలాంటి రూరల్ ఏరియాలో ఈ సినిమా కథ మొత్తాన్ని తెరకెక్కించారు. పూర్తిగా చిన్నపిల్లలు నటించిన ఇటువంటి చిత్రం తెలుగులో గత కొన్నేళ్లలో రాలేదనే చెప్పాలి. సినిమాను చూస్తున్నంతసేపు దర్శకుడు శివమ్ తన మొదటి చిత్రాన్నే ఇంతటి ఎమోషనల్ పాయింట్‌ను ఎందుకు ఎంచుకున్నాడో అనిపిస్తుంది. ఈ చిన్నపిల్లల కథలో అంత డెప్తు ఉంది మరి. అలాగే చిన్నపిల్లల స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో చూపించే ప్రయత్నాన్ని విజయవంతంగా చూపించాడు దర్శకుడు శివమ్.
సినిమా ప్లస్ లు –
చిన్నపిల్లల ఎమోషన్
ఫోటోగ్రఫీ
వాగ్దేవి పాడిన రెండు పాటలు
సినిమా మైనస్ లు–
సినిమా ఫస్టాఫ్ స్లోగా ఉండటం
కీలకపాత్రల్లో కొత్త నటీ నటులు నటించటం
బాటమ్‌లైన్–
పిల్లలకు మాత్రమే నచ్చే సినిమా
రేటింగ్– 2/5