సమ్మర్ మొత్తం ప్రేక్షకులని బోర్ కొట్టించేసింది. ఆదిపురుష్ అయినా ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటే అదీ నిరాశ పరిచిపోయింది. ఏప్రిల్ లో విరూపాక్షతో హిట్ చూసిన బాక్సాఫీసు.. మళ్ళీ సామజవరగమన వరకు డల్ గానే నడిచింది. మధ్యలో బిచ్చగాడు, 2018 డబ్బింగ్ మూవీస్ హడావిడి చేసాయి కానీ.. ఏ స్ట్రయిట్ తెలుగు మూవీ ఆడియన్స్ ని మెప్పించలేదు. గత వారం కూడా నాలుగైదు సినిమాలు విడుదల కాగా అందులో సామజవరగమన స్ట్రాంగ్ గా నిలబడింది. స్పై సో సో టాక్ తోనే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.
ఇక ఈవారం మాత్రం బాక్సాఫీసు దగ్గర హెవీ కాంపిటీషన్ కనిపిస్తుంది. దాదాపుగా ఏడెనిమిది సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో చెప్పుకోదగ్గ మూవీస్ ఒకటో రెండో అంతే. ముఖ్యంగా నాగ శౌర్య హీరోగా వస్తున్న రంగబలి పై ప్రేక్షకులు హోప్స్ పెట్టుకున్నారు. రంగబలి ట్రైలర్, ఆ సినిమా ప్రమోషన్స్ అన్నీ డిఫరెంట్ గా కనిపించడంతో ఆ సినిమాపై అంచనాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక తర్వాత కీరవాణి కొడుకు సింహ కోడూరి భాగ్ సాలే చిత్రం ఈ వారమే విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రంపై అంచనాలు పెంచేందుకు టీమ్ కష్టపడుతుంది. మేకర్స్ కూడా కొత్తగా భాగ్ సాలే ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. మరో సినిమా మిస్సమ్మ తో అవార్డ్స్ కొల్లగొట్టిన నీలకంఠ నుండి వస్తున్న సర్కిల్. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న సర్కిల్ జులై 7 నే బాక్సాఫీసు జాతరలో పార్టిసిపేట్ చేస్తుంది.
ఈ వారం ఇంకా రేసులో ఉన్న చిత్రాలు జగపతి బాబు రుద్రాంగి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య ని గెస్ట్ గా పిలిచి ప్రేక్షకుల్లో కాస్త క్యూరియాసిటీ కలిగించారు. అదే రోజు విడుదల కాబోతున్న మరో చిత్రం 7.11. అలాగే ఓ సాథియా కూడా ఈ శుక్రవారమే విడుదలకు రెడీ అయ్యింది. మరి జులై 7 నే వరసగా బోలెడన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. పొలోమంటూ బాక్సాఫీసు మీద దండయాత్రకు దిగుతున్న ఈ చిత్రాల్లో ఏది సక్సెస్ అనిపించుకుంటుందో, ఆడియన్స్ నుండి ఏది హిట్ అనిపించుకుంటుందో చూడాలి.