Advertisementt

అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేస్తున్న సమంత

Wed 05th Jul 2023 07:36 PM
samantha  అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేస్తున్న సమంత
Samantha returns advance payments to producers అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేస్తున్న సమంత
Advertisement
Ads by CJ

సమంత ఇప్పటికీ ఫుల్ బిజీగా దూసుకుపోతున్న తార. పెళ్లి తర్వాత స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోయినా.. వెబ్ సీరీస్, ఐటెం సాంగ్స్, విమెన్ సెంట్రిక్ మూవీస్ అంటూ గ్లామర్ గా రచ్చ లేపుతున్న సమంత.. గత ఏడాది మాయోసైటిస్ వ్యాధితో బాగా సతమతమయ్యింది. ఆరు నెలల పాటు సమంత బయటికి రాలేదు. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ లో ఉండిపోయింది. ఇక ఈ ఏడాది మళ్ళీ సిటాడెల్ వెబ్ సీరీస్, ఖుషి మూవీస్ షూటింగ్స్ తో బిజీ అయ్యి రొటీన్ లో లైఫ్ లో పడింది అనుకుంటున్నారు. తరచూ జిమ్ వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ వస్తున్న సమంత ఓ ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది అనే న్యూస్ ఈ రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

సమంత ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకుని వ్యక్తిగతంగానూ, హెల్త్ పరంగాను కేర్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కి నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్స్ లు రిటర్న్ చేస్తుంది అనే న్యూస్ కూడా వైరల్ అయ్యింది. ఆమె సిద్దు జొన్నలగడ్డతో వర్క్ చేసేందుకు నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అవ్వగా.. దానికి అడ్వాన్స్ అందుకుందట. కానీ ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసింది అనే న్యూస్ మొదలయ్యింది.

అసలు నిజంగానే సమంత బ్రేక్ తీసుకోబోతుందా? అలాగే అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చేస్తుందా? అనే విషయంలో పక్కా క్లారిటీ అయితే లేదు. 

Samantha returns advance payments to producers :

Samantha will take long break from acting to focus on her health

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ