Advertisementt

Coming Soon!! అంటున్న మహేష్

Wed 05th Jul 2023 04:51 PM
mahrsh babu  Coming Soon!! అంటున్న మహేష్
SSMB29 loading Coming Soon!! అంటున్న మహేష్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లకి చాలా క్రేజ్ ఉంటుంది. ఆయన ఏదైనా పోస్ట్ వెయ్యగానే అభిమానులు లైక్స్, షేర్స్ తో హోరెత్తిస్తారు. సూపర్ స్టార్ తాజాగా ఓ కొత్త లుక్ ని షేర్ చేస్తూ Coming Soon!! అంటూ ట్వీట్ చేసారు. అసలు ఆయన దేనికి కమింగ్ సూన్ అని చెప్పారో కూడా తెలియకుండానే అందరూ ఆయన నుండి #SSMB29 అప్ డేట్ రాబోతుంది అని ఫిక్స్ అవుతున్నారు. మరోపక్క మహేష్ బర్త్ డే కి కౌన్ డౌన్ మొదలైపోయింది. ఆగస్టు 9 న మహెష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు కారం నుండి ఏదో ఒక స్పెషల్ ఉండనే ఉంటుంది. 

మరి మహేష్ బాబు బర్త్ డే అప్ డేట్ కోసం కమింగ్ సూన్ అన్నారా.. లేదంటే #SSMB29 కోసం కమింగ్ సూన్ అన్నారో తెలియదు కానీ.. మహేష్ బాబు కొత్త లుక్ మాత్రం ఫాన్స్ కి భీభత్సంగా నచ్చేసింది. అయితే ఇదంతా మహేష్ #SSMB29 కోసమే అని మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో #SSMB29 హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ SSMB29 లోడింగ్ అంటూ పండగ చేసుకుంటున్నారు. మరోపక్క హీరో సింహ కోడూరి కూడా మహేష్ బాబు - రాజమౌళి గారి సినిమా గురించి ఇంట్లో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం. 

సినిమా వర్క్ చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అంటూ  భాగ్ సాలే ఇంటర్వూస్ లో చెప్పడం కూడా మహేష్ ఫాన్స్ కి కిక్ ఇచ్చింది. మరి మహేష్ బాబు కమింగ్ సూన్ కి అర్థమేమిటో చూడాలి. 

SSMB29 loading:

Mahesh says SSMB29 loading?

Tags:   MAHRSH BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ