KGF 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ అప్పుడే తాను డైరెక్ట్ చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ సలార్ ని విడుదలకి సిద్ధం చేస్తున్నారు. KGF 2 విడుదలయ్యి ఇప్పటికే 16 నెలలు పూర్తయ్యింది. ఇంతవరకు యశ్ కొత్త సినిమా ఊసు లేదు. అసలు యశ్ తన తదుపరి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో అని ఆయన అభిమానులకి ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచిపోతున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ టీజర్ రేపు జులై 7 తెల్లవారు ఝామున వచ్చెయ్యబోతుంది.
మరి #Yash19 ఎప్పుడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. #Yash19 హాష్ టాగ్ తో హంగామా చేస్తున్నారు. నెటిజెన్స్ కూడా ఏమిటి యశ్ ఇంత లాగ్ చేస్తున్నావ్ అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. నర్థన్ తో యశ్ తదుపరి చిత్రం అనౌన్సమెంట్ చేస్తారనే టాక్ నడిచినా యశ్ మాత్రం ఇంకా ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు కానీ కొత్త సినిమా మాత్రం ప్రకటించడం లేదు. KGF లాంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత సాదా సీదా సినిమా చేయలేము.. సో కొంచెం వెయిట్ చెయ్యాలని యశ్ చెప్పాడు. అలాగే ఈ మధ్యన బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
మరి ప్రశాంత్ నీల్ సలార్ ప్రభంజనం మొదలవుతుంటే.. యశ్ అభిమానులు మాత్రం తన హీరో సినిమా ఇంకా మొదలు కాలేదనే నిరాశలో కనిపిస్తున్నారు. ఆ నిరాశను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్నారు.