గత నాలుగు నెలలుగా మెగా డాటర్.. నాగబాబు కుమర్తె నిహారిక తన భర్త చైతన్యతో విడిపోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మీడియా మెగా ఫ్యామిలీపై ఫోకస్ పెట్టింది. నిహారిక, నాగబాబు, వరుణ్ తేజ్ ఎక్కడ కనిపించినా ఈ మేటర్ ని కదిలించింది.. కానీ వారు ఏ విధంగానూ ఈ విషయమై రెస్పాండ్ అవ్వలేదు. ఇక నిన్న ఒక్కసారిగా నిహారిక డివోర్స్ విషయం హైలెట్ అయ్యింది. ఛానల్స్ లో, వెబ్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో ప్రముఖంగా నిహారిక విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది అంటూ న్యూస్ హాట్ హాట్ గా చక్కర్లు కొట్టింది.
అయితే ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. అలాగే విడాకుల విషయం బయటికొచ్చాక నిహారిక తనని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే ఒకరికి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే ఈ రోజు బుధవారం నిహారిక డివోర్స్ విషయంపై ఓ నోట్ ని సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్త ఛైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లుగా ఓపెన్ అయ్యింది. అంతేకాకుండా విడాకులు తీసుకున్నాక వ్యక్తిగత జీవితంలో తామిద్దరం ప్రైవసీని కోరుకుంటున్నామని.. రాసుకొచ్చింది.
అందరూ నా విజ్ఞప్తిని గౌరవించాలని.. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ గా నిలిచిన ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్, సన్నిహితులకు థాంక్స్ చెప్పింది. అయితే నిహారిక తన పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ కూడా బ్లాక్ చేసింది. నిహారిక పోస్ట్ చూసిన నెటిజెన్స్ చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్నప్పుడు అంగరంగ వైభంగా ఆ ఫొటోస్ ని వీడియోస్ ని షేర్ చేసి అందరితో పంచుకున్నావు. ఇప్పుడు ఈ విడాకుల విషయాన్ని అలాగే ఓపెన్ గా చెప్పావు అంటూ అప్రిషేట్ చేస్తున్నారు.