కుర్ర హీరో నిఖిల్ కార్తికేయ 2 తో అనుకోకుండా ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. నార్త్ లో కార్తికేయ 2 ని ప్రేక్షకులు ఎంతెలా ఆదరించారో ఆక్కడ కొల్లగొట్టిన కలెక్షన్స్ చూపించాయి. అయితే నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా కంటెంట్ తోనే మొదలు పెట్టాడు. స్పై గా గూఢచారి పాత్రలో కనిపించిన నిఖిల్ ఆ చిత్రాన్ని కూడా పలు భాషల్లో విడుదల చెయ్యాలని చూసాడు. కానీ కొన్ని కారణాల వలన కేవలం తెలుగులోనే ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అయితే నెగెటివ్ టాక్ తోనే వారం తిరక్కుండానే స్పై మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది. స్పై బ్రేక్ ఈవెన్ సాధించడంతో ఎమోషనల్ అయిన నిఖిల్.. ప్యాన్ ఇండియా ఆడియన్స్ కి క్షమాపణ చెబుతూ ఓ నోట్ విడుదల చేసాడు.
నా సినిమాపై, నాపై నమ్మకం ఉంచి చాలామంది అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే టికెట్స్ కొన్నారు. దీనితో స్పై కి నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ గా ఉంది. కానీ ఇదే టైమ్ లో కొంత బాధగా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల కారణంగా ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయాము. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకి క్షమాపణలు చెబుతున్నాను. కార్తికేయ 2 తో మీ అందరికి దగ్గరయ్యాను. స్పై సినిమాని మీకు అందించలేకపోయాను.
కానీ నా నుండి రాబోయే మూడు చిత్రాలని మీ ముందుకు ఖచ్చితంగా అనుకున్న తేదీకే తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు ప్రేక్షకులకి కూడా మాటిస్తున్నాను. ఇకపై క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వను. నాపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా మంచి కంటెంట్ ఉన్న సినిమాని మీకు అందిస్తాను అంటూ అభిమానులకి ఓ నోట్ రిలీజ్ చేసాడు నిఖిల్.