పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల అండ దండా ఎంతుందో అది కొలమానంలో కొలవడం కష్టమే. కానీ రీసెంట్ గా ఆయన సోషల్ మీడియాలో హ్యాండిల్ ఇన్స్టాలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. జస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే పొలోమంటూ ఆయన వెనుక మేమున్నామంటూ ఫాలోవర్స్ వచ్చేసారు. పవన్ కళ్యాణ్ తన ఇన్స్టా పేజీ లో ఎలాంటి పిక్ పోస్ట్ కూడా చెయ్యలేదు. కేవలం ఆయన అకౌంట్ ఓపెన్ చేసారు అంతే. దానికే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరారు.
ఇక పవన్ కళ్యాణ్ అలా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసారో.. లేదో.. ఇలా ఫేక్ అకౌంట్స్ ఓపెన్ అవడము.. వాళ్ళకి వేలల్లో ఫాలోవర్స్ వచ్చెయ్యడం కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇన్స్టా ఖాతాలో ఎలాంటి పిక్ పోస్ట్ చేస్తారా అని అందరూ చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఇన్స్టా ఓపెన్ చేసాక టాలీవుడ్ స్టార్ హీరోలు ఫాస్ట్ గా 1M ఫాలోయర్స్ ని చేరుకోవడానికి ఎంత టైం పట్టిందో అనేది కొంతమంది సోషల్ మీడియాలో ట్వీట్స్ వేసి చూపిస్తున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ గా నిలవడం ఆయన స్టామినాకి నిదర్శనంగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
#PawanKalyan - 380 mins
#Prabhas - 23 days
#RamCharan - 74 days
#MaheshBabu - 89 days
#AlluArjun - 184 days
#NTR - 416 days