మెగా డాటర్ నిహారిక భర్తతో విడిపోయిందా అంటే సోషల్ మీడియా టాక్ ప్రకారం అవుననే తెలుస్తోంది 2020 కరోనా సమయంలో బంధుమిత్రుల సమక్షంలోరాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో నాగబాబు తన కుమార్తె నిహారికాని చైతన్య జొన్నలగడ్డకి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. రెండేళ్లు బాగానే గడిపిన ఈ జంట వెకేషన్స్ లో తరచూ ఫొటోస్ ని షేర్ చేస్తూ హడావిడి చేసింది. కానీ కొన్నాళ్లుగా అంటే ఓ ఆరు నెలలుగా నిహారిక ఆమె భర్తతో కలిసి ఉండడం లేదు అనేది వారు కనిపిస్తున్న తీరుతో అర్ధమవుతుంది.
సోషల్ మీడియాలో ఒకరి ఫొటోస్ ని ఒకరు డిలేట్ చేసుకోవడం.. తర్వాత నిహారిక ఒంటరిగా ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్లి రిలాక్స్ అవడం, అలాగే అన్న ఎంగేజ్మెంట్ లో ఒంటరిగా కనిపించడం ఇవన్నీ భర్త చైతూతో నిహారిక విడిపోయింది అనే దానికి సంకేతాలుగా కనిపించాయి. కానీ మెగా కాంపౌండ్ నుండి ఈ విషయమై ఎలాంటి స్పందన లేదు. నాగబాబు కూడా కూతురు కాపురం విషయంలో నోరు మెదపడమే లేదు. అటు చైతన్య జొన్నలగడ్డ కూడా ఈమధ్యన యోగ గురించి ట్వీట్ చేస్తూ ఈ విడాకుల విషయంపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసాడు.
తాజాగా నిహారిక-చైతన్య జొన్నలగడ్డ దంపతులు ఇప్పుడు తాజాగా విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కినట్లుగా తెలుస్తోంది. తాజాగా నిహారిక డివోర్స్ కోసం అప్లై చేసినట్లుగా ఓ పిటిషన్ వైరల్ గా మారింది. ఇది అధికారిక ప్రకటన అంటూ కథనాలు ప్రచురితమవుతున్నాయి. నిహారిక-చైతన్య జొన్నలగడ్డ లకి మధ్యన మనస్పర్థలు రావడంతో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట.