విజయ్ వర్మ-తమన్నాల సీక్రెట్ డేటింగ్ ని ఈమధ్యనే తమన్నా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో రివీల్ చేసింది. గత ఏడాదిన్నరగా సీక్రెట్ ని మెయింటింగ్ చేసిన ఈ జంట రీసెంట్ గానే ఓపెన్ అయ్యింది. అయితే తాజాగా తమన్నా తాను విజయ్ వర్మని ప్రేమించడానికి అసలు కారణాలను రివీల్ చేసింది. విజయ్ వర్మ మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. అతను నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అందుకే నేను అతన్ని ఇష్టపడ్డాను. విజయ్ వర్మ తన ఫ్యామిలోని లేడీస్ ని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి మర్యాదనిస్తాడు.
కుటుంబంలోని వారిని గౌరవిస్తే.. ఖచ్చితంగా వారు బయటివారిని కూడా గౌరవిస్తారు. అలాగే ఉంటారని నమ్ముతాను. ఈ తరం యువత ఎదుటి వారిని గౌరవించడం, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకోవాలి. ఇతరులతో ఎలా ఉండాలో పేరెంట్స్ కూడా నేర్పించాలి. మహిళలు ప్రతి విషయంలో రాజి పడాలనే భావనను నేను అంగీకరించను.. అంటూ విజయ్ వర్మని ఇష్టపడానికి అసలు కారణాలను మిల్కి బ్యూటీ బయటపెట్టేసింది.
అంతేకాకుండా లస్ట్ స్టోరీస్2 లో తమన్నా కేరెక్టర్ పై వస్తున్న విమర్శలపై కూడా స్పందించింది. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి వాటిని వ్యతిరేఖిస్తారని అని అస్సలు ఊహించలేదు. అదే హీరోలు ఏ పాత్రలు చేసినా ఆహా ఓహో అంటూ ప్రశంసిస్తారు. కానీ హీరోయిన్స్ చేస్తే వ్యతిరేఖిస్తారు. ఇదెక్కడి న్యాయమో నాకర్ధం కావడం లేదు అంటూ కాస్త విసుగుని ప్రదర్శించింది తమన్నా.