బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ కి యాక్సిడెంట్ అని తెలియగానే ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. జవాన్ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని షారుఖ్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో షారుఖ్ కి ప్రమాదం జరిగింది అని తెలిసి ఫాన్స్ కంగారు పడిపోతున్నారు. అయితే షారుఖ్ కి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. దానితో చిత్ర బృందం ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆయన్ని వైద్యులు పరీక్షించారట.
డాక్టర్స్ మాత్రం షారుఖ్ ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సెప్పారట. తర్వాత షారుఖ్ వేంటనే ఇండియాకి తిరిగి వచ్చేశారని తెలుస్తోంది. ఆయన ముంబై లోని తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని సమాచారం. లాస్ ఏంజెల్స్ లో షారుఖ్ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో ఆయన ముక్కుకి గాయమైంది అని, డాక్టర్స్ వెంటనే రియాక్ట్ అవడంతో షారుఖ్ హాస్పిటల్ నుండి వెంటనే డిశ్ఛార్జ్ కూడా అయ్యారని తెలుస్తోంది.
కొన్నాళ్ల క్రితమే అమెరికాలో షారుఖ్ కి జరిగిన ఈ ప్రమాదం చాలా లెట్ గా లీకై ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చాలా సేఫ్ గా ఉన్నారని.. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ప్రస్తుతం జవాన్ ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.