Advertisementt

ప్రేమపై సమంత పోస్ట్ వైరల్

Tue 04th Jul 2023 02:40 PM
samantha  ప్రేమపై సమంత పోస్ట్ వైరల్
Samantha post on love goes viral ప్రేమపై సమంత పోస్ట్ వైరల్
Advertisement
Ads by CJ

సమంత గతంలో హీరో సిద్దార్థ్ తో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపింది. తర్వాత సిద్దార్థ్ తో బ్రేకప్ అయ్యి ఒంటరిగా ఉన్న సమయంలో నాగ చైతన్య ఫ్రెండ్ షిప్ ఆమెని మరోసారి ప్రేమలో పడేలా చేసింది. నాగ చైతన్య తో ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి వరకు దారి తీసింది. అంగరంగ వైభవంగా నాగ చైతన్యని పెళ్ళాడి అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టి, నాలుగేళ్లు వివాహ బంధంలో సంతోషంగా గడిపిన సమంత రెండేళ్ల క్రితమే చైతూతో విడిపోయింది. వారి మధ్యన తలెత్తిన విభేదాలు విడాకులకు దారి తీసింది.

విడాకుల తర్వాత మానసికంగా సతమతమైన సమంత ఆ తర్వాత సినిమా షూటింగ్స్ లో బిజీ అయినా.. మాయోసైటిస్ మరోసారి సమంతని కుంగదీసింది. ఆరు నెలలు మాయోసైటిస్ తో పోరాడిన సమంత మళ్ళీ షూటింగ్స్ తో వర్కౌట్స్ అంటూ యాక్టీవ్ గా మారిపోయింది. ఖుషి-సిటాడెల్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేని బిజీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారడమే కాదు.. అందరూ సమంత మరోసారి ప్రేమలో పడింది అనుకునేలా ఉంది.

చావు మనకి చేరువైనప్పుడు మనల్ని ఏది చావు నుండి కాపాడలేదు. కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి.. అంటూ ప్రముఖ రచయిత ఫ్యాబ్లో నెరుడా చెప్పిన మాటలని సమంత తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. మరి సమంత ఇలాంటి కోడ్స్ ఎందుకు షేర్ చేసింది.. అంటే సమంత మరోసారి ప్రేమలో పడిందా అనే అనుమానం మాత్రం నెటిజెన్స్ లో బాగా మొదలయ్యింది.

Samantha post on love goes viral:

Samantha cryptic post goes viral

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ