Advertisementt

ప్రాజెక్ట్ K: కమల్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Tue 04th Jul 2023 12:15 PM
kamal haasan  ప్రాజెక్ట్ K: కమల్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Project K: Interesting News on Kamal Role ప్రాజెక్ట్ K: కమల్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో ప్యాన్ వరల్డ్ మూవీగా మొదలైన ప్రాజెక్ట్ K ఇప్పుడు దాని స్థాయిని మరింతగా పెంచుకుంది. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రాజెక్ట్ K మొదలైనప్పుడే అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ తో రేంజ్ ని పెంచుకున్న ప్రాజెక్ట్ K ఇప్పుడు కమల్ హాసన్ ని తీసుకొచ్చి ఆ అంచనాలను రెట్టింపు చేసారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ నెగెటివ్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో ఉంది.  

అయితే కమల్ రోల్ పై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ ని ఢీ కొట్టబోయే కమల్ హాసన్ రోల్ అత్యంత భయానకంగా ఉండబోతుందట. ఈ ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే పిచ్చి కోరికతో.. అత్యంత స్వార్ధపరుడిగా, క్రూరుడిగా కమల్ కనిపిస్తారట. కలియుగం ఎలా అంతమవుతుంది, ఎవరి వల్ల అంతమవుతుంది అనేది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నమాటే. ఇప్పుడు అదే ఓ వ్యక్తి స్వార్ధానికి ప్రపంచం ఎలా అంతమవుతుంది అనేది నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K లో కమల్ పాత్ర ద్వారా చూపించబోతున్నాడట.

అయితే కమల్ హాసన్ పాత్ర లుక్ డిజైన్ ఎలా ఉంటుంది.. ఈపాత్రతో కమల్ క్రూరత్వాన్ని చూపించబోతున్నారు అనే విషయంలో ఆయన ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక కమల్ హాసన్ ప్రాజెక్ట్ K ద్వారా పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపిస్తారని..ఈ పాత్ర ఆయనకి సవాల్ విసిరినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. 

Project K: Interesting News on Kamal Role:

Kamal Haasan to play the antagonist in Prabhas Project K

Tags:   KAMAL HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ