ఇప్పుడు చాలామంది ఆడియన్స్ రాజమౌళిని, మహేష్ బాబుని తెగ విమర్శించేస్తున్నారు. అదేమిటి టాప్ డైరెక్టర్, ఆస్కార్ పట్టుకొచ్చి తెలుగోడి గౌరవాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళిని విమర్శించడమేమిటి.. అలాగే సూపర్ స్టార్ మహేష్ తన సినిమా షూటింగ్స్, తన యాడ్ షూటింగ్స్ అవి చేసుకుపోతారు.. మరో విషయంలో వేలు పెట్టారు. అలాంటి వాళ్ళని ఆడియన్స్ విమర్శించడమేమిటి అనుకుంటున్నారా..
అసలు విషయమేమిటంటే.. రాజమౌళి, మహేష్ ల బ్రాండ్ విలువ తెలియంది కాదు. వారు ఒక మాట చెప్పారంటే అందరిలో దానిపై చాలా ఇంట్రెస్ట్, కుతూహలం కలుగుతుంది. ఇప్పుడు రాజమౌళి, మహేష్ ని అదే విమర్శల పాలు చేసింది. మే చివరి వారంలో కుర్ర హీరో నటించిన మేమ్ ఫేమస్ బావుంది అంటూ రాజమౌళి, మహేష్ సోషల్ మీడియా వేదికగా చిన్న సినిమాని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. కొంతమంది రాజమౌళి, మహేష్ వేసిన ట్వీట్స్ చూసి సినిమా టికెట్స్ కొని సినిమా చూసి.. ఇంత చెత్త సినిమాని వీరు ప్రమోట్ చేసారు. అనవసరంగా చూశామని మొత్తుకున్నారు.
అయితే ఇప్పుడొక చిన్న సినిమా సామజవరగమన గత శుక్రవారం విడుదలై అనూహ్యమైన సక్సెస్ సాధించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ యునానమస్ గా బావుంది అంటూ చెప్పడం, రోజు రోజుకి ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరగడం, మౌత్ టాక్ తోనే సామజవరగమన హిట్ అయ్యింది. అయితే ఏ చిత్రాన్ని చూసిన నాగ చైతన్య, రవితేజ సామజవరగమన చిత్రం బావుంది అంటూ టీంని అప్రిశేట్ చేస్తూ ట్వీట్స్ వేశారు.
అంత బావున్న సినిమాకి మిగతా స్టార్ ఎవరూ పట్టించుకోలేదు. అప్పట్లో మేమ్ ఫేమస్ చిత్రానికి రాజమౌళి, మహేష్ లాంటి స్టార్స్ ప్రమోట్ చేసి ఆడియన్స్ చేత డబ్బులు పెట్టించారు. ఇప్పుడు కంటెంట్ పరంగా బావున్న సినిమాని స్టార్స్ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు మొదలయ్యాయి.