కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ పాపులర్ అయ్యింది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని కిర్రాక్ పేరుతొ పాపులారిటీ సంపాదించుకోవడంతో ఇప్పుడు తానే కాకుండా ఈ చేపల పులుసు పేరు మీద ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు. ఇప్పటికే అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొఫ్రాంచైజీస్ ఇచ్చిన ఆర్పీ ఇప్పుడు హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ చేసాడు. కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉండగా.. మిగతావన్నీ ఫ్రాంచైజీస్ గా మార్చేసి ఇచ్చేస్తున్నాడు.
అయితే తన చేపల పులుసుపై కొంతమంది కావాలనే కుట్ర చేస్తున్నారు.. నా చేపల పులుసు బాలేదంటూ నెగిటివిటి ప్రచారం చేస్తున్నారు. పెయిడ్ బ్యాచ్ చేసే నెగిటివిటీ వలన నాకేమి నష్టం లేదు. నా చేపల కూరకి బోలెడంత డిమాండ్ ఉంది. టాలీవుడ్ హీరోలు నా చేపల పులుసు మళ్ళీ మళ్ళీ తీసుకెళుతున్నారు అంటే అది వారికి నచ్చబట్టే కదా.. సో వారెంతగా నెగిటివిటీ ప్రచారం చేసినా, ట్రోల్స్ చేసినా నేను క్వాలిటీగా సప్లై చేస్తున్నంతసేపు నాకు భయం లేదు. నెల్లూరు చేపలతోనే నేను పులుసు పెడుతున్నాను. ఒక్కోసారి అనుకున్నంతగా చేపల పులుసు అందించలేకపోతున్నాను.
కానీ నా వరకు నేను బెస్ట్ చేపల పులుసు అందించడానికి చూస్తాను. ఇప్పుడు నా పెద్దారెడ్డి చేపల పులుసుని కావాలని ఫ్రాంచైజీస్ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారంటే నాపై ఉన్న నమ్మకమే, నా చేపల పులుసు టేస్ట్ నచ్చబట్టే కదా అంటూ ఆర్పీ ట్రోల్స్ చేసే వారికి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చేసాడు.