కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా లక్ష్మి కళ్యాణం మూవీతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇంచుమించుగా కాజల్ తో పాటుగా తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ లు ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా ఎంటర్ అయ్యారు. దాదాపుగా అందరూ స్టార్ హీరోయిన్ రేంజ్ ని, స్టేటస్ ని ఎంజాయ్ చేసారు. అయితే వీరంతా కలిసి నటించినా, నటించకపోయినా.. వీరి మధ్యన స్నేహపూర్వక వాతావరణం ఉన్నట్లుగా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. తాజాగా కాజల్ పెళ్లి చేసుకుని తల్లయ్యింది.
అయినప్పటికీ సమంత, తమన్నా లకు పోటీ ఇస్తూనే ఉంది. రీసెంట్ గా కాజల్ తన అభిమానులతో చిట్ చాట్ చెయ్యగా.. తన అభిమానులతో చాలా విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా మీకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే.. నాకు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సమంత, తమన్నా, రకుల్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. మేమంతా తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాము.
అంతేకాకుండా మా అందరికీ తీరిక దొరికితే ఖచ్చితంగా హోటల్లో కలుస్తుంటాము.. అంటూ సమంత, రకుల్, తమన్నా లతో తన ఫ్రెండ్ షిప్ ని కాజల్ ఇన్నాళ్ళకి రివీల్ చేసింది. వీరంతా ఫ్రెండ్లీ గా ఉండడం వాళ్ళ వాళ్ళ అభిమానులకి కూడా బాగా నచ్చేసింది.