యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. రీసెంట్ గానే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్ళాడు. అయితే కొరటాల ఈలోపు ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించేసారు. ఎన్టీఆర్ దుబాయ్ నుండి హైదరాబాద్ కి చేరుకొని మళ్ళీ దేవర టీమ్ కి అందుబాటలోకి రావడంతో రేపటినుండి కీలక యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ - సైఫ్ అలీ ఖాన్.. అలాగే మరికొంతమంది ఫైటర్స్ పాల్గొనబోయే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు.
ఈ యాక్షన్ షెడ్యూల్ ముగియగానే కొరటాల శివ చిన్నపాటి గ్యాప్ తో మరో యాక్షన్ ఎపిసోడ్ కి రెడీ అవుతారట. సల్మాన్ మాస్టర్ పర్యవేక్షణలో మరికొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరించనున్నారు. సాల్మన్ మాస్టర్ గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ మూవీస్ కు పనిచేశారు. ఇప్పుడు దేవర లోకి ఎంటర్ అవుతారట. ఇక ఇప్పుడాయన ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.
దేవర మొత్తం యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఉంటుంది అని.. అందుకే కొరటాల హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలోనూ కొన్ని ఫైట్ సన్నివేశాలని చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.