మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కారణమేమి లేదు.. మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ మొదలు పెట్టి అది పూర్తి కాకూండానే అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ మూవీ అంటూ త్రివిక్రమ్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇవ్వడం మహేష్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. మహేష్ తో గుంటూరు కారం షూటింగ్ వరస షెడ్యూల్స్ అంటూ పరుగులు పెట్టించడం లేదు, మధ్యలో బ్రేక్స్ వేస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ అన్న సినిమాకి ఇప్పటిరకు 50 శాతం షూటింగ్ కూడా పూర్తి కాలేదు.
మరోపక్క గుంటూరు కారం నుండి కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పక్కనపడేసి.. ఫ్రెష్ గా సీన్స్ చేస్తున్నారు. మరోపక్క నటులు మారిపోతున్నారు. ఇప్పటికే మెయిన్ లీడ్ పూజ హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి బయటికెళ్ళిపోగా.. కొత్తగా మీనాక్షికి చౌదరి వచ్చింది. ఇక థమన్ విషయం తేల్చడమే లేదు. ఇన్ని కంఫ్యూజన్స్ మధ్యన గుంటూరు కారం కొత్త షెడ్యూల్ రీసెంట్ గానే మొదలైంది. ప్రస్తుతం కాలేజ్ సీన్స్ ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ తో ఇంత హడవిడిగా త్రివిక్రమ్ మూవీని అనౌన్సమెంట్ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చింది. అయినా.. ఇలా మహేష్ సినిమా చేస్తూ మరో హీరో సినిమాని ప్రకటించడం మా హీరోకి ఘోర అవమానమంటూ మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు.