అఖిల్ ఏజెంట్ ఏప్రిల్ 28 రిలీజ్ అయ్యి ఆడియన్స్ కి ఎంత పెద్ద షాకిచ్చిందో.. హీరో, నిర్మాత, సురేందర్ రెడ్డికి అంతే పెద్ద షాకిచ్చింది. ఇప్పటికే ఏజెంట్ ప్లాప్ కి నిర్మాత అనిల్ సుంకర బాధ్యత వహిస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ఆయన సామజవరగమన సక్సెస్ ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. ఏజెంట్ విషయంలో అందరిది తప్పు వుంది. కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు. నేను, సురేంద్ రెడ్డి ఈ సినిమాతో ఒక హీరోని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తామని అనుకుని మొదలుపెట్టాం.
కానీ మేము ఆశించిన ఫలితం రాలేదు. నిర్మాతగా ఈ ఫలితానికి భాద్యత వహిస్తాను.. అంటూ మరోసారి అనిల్ సుంకర ఏజెంట్ విషయంలో మట్లాడారు. అంతేకాకుండా ఏజెంట్ మూవీ ఓటిటిలో విడుదల చేసేందుకు ఎలాంటి ఎడిటింగ్ చెయ్యడం లేదు, మేము ఓటిటి సంస్థ సోని లివ్ కి అలాంటివేమీ ఇవ్వలేదు. ఏజెంట్ ని ఓటిటిలో విడుదల చేసేందుకు ఎడిటింగ్ చేస్తున్నారు అనే విషయంలో ఎలాంటి నిజం లేదు. అది ఏ డేట్ కి రిలీజ్ చేయాలో అనేది ఆ ఓటిటి సంస్థ ఇష్టం.. అంటూ ఏజెంట్ రిలీజ్ పై అనిల్ సుంకర తేల్చేసారు.