Advertisementt

మీ కీర్తిని.. మీ పేరుని వాడుకోను: బండ్ల

Mon 10th Jul 2023 10:16 AM
guru poornima,bandla ganesh,pawan kalyan,guruvu  మీ కీర్తిని.. మీ పేరుని వాడుకోను: బండ్ల
Bandla Ganesh Tweet on Pawan Kalyan Goes Viral మీ కీర్తిని.. మీ పేరుని వాడుకోను: బండ్ల
Advertisement
Ads by CJ

గురు పౌర్ణమి సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని దేవుడిలా భావించే బండ్ల గణేష్.. ఇప్పుడు గురు పౌర్ణమిని పురస్కరించుకుని.. ఆయనని గురువుగా భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ పవన్ కల్యాణ్ పేరుని, కీర్తిని వాడుకుని లబ్ధి పొందనని గురు పౌర్ణమి సాక్షిగా చెబుతున్నట్లుగా బండ్ల తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే ఇప్పటి వరకు ఆయన గురువు అని సంభోదిస్తూ.. త్రివిక్రమ్‌పై పంచ్‌లు పేలుస్తూ వచ్చారు. ఇప్పుడు సడెన్‌గా పవన్ కల్యాణ్‌ని గురువు అనడంతో కొందరు ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్థమైన వారు మాత్రం మరోసారి బండ్లకు జేజేలు పలుకుతున్నారు. 

ఇంతకీ బండ్ల ఏం ట్వీట్ చేశాడంటే.. గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్ని సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్న.. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని గానీ మీ పేరుని వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను అనీ.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెప్తున్నాను.  నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసులాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్..... అని బండ్ల తన ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. 

ఇప్పుడీ ట్వీట్‌పై నెటిజన్లు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ‘వీలైతే మీకు సహాయంగా ఉంటాను, లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందను’ అని బండ్ల చెప్పిన ఈ లైన్‌ని వారు బాగా లైక్ చేస్తున్నారు. నువ్వు దూరంగా ఉండటం ఏంటన్నా.. నువ్వెప్పుడూ బాస్‌కి సహాయంగానే ఉండాలని కోరుతున్నారు. మొత్తంగా మరోసారి బండ్ల వార్తలలో హైలెట్ అవుతున్నాడు.

Bandla Ganesh Tweet on Pawan Kalyan Goes Viral:

Bandla Ganesh Guru Poornima Post Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ