ఆదిపురుష్ హడావిడి ముగిసేవరకు సలార్ నుండి ఎలాంటి అప్ డేట్ రాదు అన్నట్టుగానే మేకర్స్.. ఇప్పుడు ఆదిపురుష్ థియేటర్ రన్ పూర్తవడంతో సలార్ టీజర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఆదిపురుష్ జూన్ 16 న విడుదలై విపరీతమైన నెగిటివిటి, కాంట్రవర్సీల మధ్యన థియేటర్స్ రన్ పూర్తయ్యింది. ఇక థియేటర్స్ లో ఆదిపురుష్ సందడి ముగిసిపోయింది. ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుండో సలార్ టీజర్ కోసం వెయిటింగ్. అసలైతే ఆదిపురుష్ థియేటర్స్ లోనే సలార్ టీజర్ ప్రదర్శిస్తారని అన్నారు.
కానీ అలా జరగలేదు. అప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ సలార్ హాష్ టాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. అయితే తాజాగా సలార్ టీజర్ డేట్ లాక్ చేశారట. జులై 7 న యాక్షన్ ప్యాకెడ్ సలార్ ట్రైలర్ ని వదలబోతున్నారని.. నేడో రేపో దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆదిపురుష్ పై వచ్చిన విమర్శలకు సలార్ టీజర్ చెక్ పెడుతుంది అని ప్రభాస్ ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు.
సలార్ మూవీతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ తన సత్తా మరోసారి చాటుతాడని ప్రభాస్ ఫాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి సలార్ టీజర్ వస్తే చాలు.. సినిమాపై అంచనాలు మరికాస్త పెరుగుతాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ సలార్ సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది అంటూ ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు.