సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత సిస్టర్‌గా నటించి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హీరోయిన్ అవతారమెత్తిన తేజస్వి మదివాడ పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది. తర్వాత బిగ్ బాస్‌లోకి వెళ్ళింది. అక్కడే తనకి వచ్చిన హెల్త్ రీజన్స్ బయటపెట్టింది. అయితే ఎప్పుడు గ్లామర్‌గా బోల్డ్‌గా కనిపించే తేజస్వి బిగ్ బాస్‌కి వెళితే అవకాశాలు వచ్చేస్తాయని ఆశపడింది. బిగ్ బాస్ ఓటిటిలోకి కూడా ఎంటర్ అయ్యింది కానీ ఆమెకి అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ అఖిల్ సార్థక్‌తో కలిసి BB జోడిలో రెచ్చిపోయి డాన్స్ చేసింది. అపట్లో తేజస్వి మదివాడ అఖిల్‌ని ప్రేమిస్తుంది, వివాహం కూడా చేసుకుంటుందని అన్నారు.
కానీ తాజాగా తేజస్వి మదివాడ పెళ్లి చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అది అఖిల్‌తో కాదట. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వ్యక్తిని తేజస్వి పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తేజస్వి నిశ్చితార్థం కూడా అయిపోయిందని.. పెళ్లి కూడా త్వరలోనే చేసుకుంటుందని, పెళ్లి అయ్యాకే తన పెళ్లి గురించి చెప్పనుందని అంటున్నారు. అసలు తేజస్వి ఎవరిని వివాహం చేసుకుంటుంది. ఎందుకింత సీక్రెట్‌ని మెయింటైన్ చేస్తుంది? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే తేజస్వి గతంలో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. ఇప్పుడు తేజస్వి వివాహం చేసుకోబోతుంది అన్న విషయం తెలిసి నెటిజన్స్ ఆమె గతంలో పెళ్లి గురించి చేసిన కామెంట్స్‌ను లాగుతూ నువ్వేనా పెళ్లి చేసుకునేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.