Advertisementt

ఇండియన్ 2లో బ్రహ్మానందం

Sun 09th Jul 2023 05:53 PM
indian 2,brahmanandam,vadivelu,shankar,kamal haasan  ఇండియన్ 2లో బ్రహ్మానందం
Brahmanandam in Shankar and Kamal Combo Film Indian 2 ఇండియన్ 2లో బ్రహ్మానందం
Advertisement
Ads by CJ

కమల్ హాసన్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో కాకపోయినా.. మధ్య మధ్యలో గేమ్ ఛేంజర్ షూటింగ్ బ్రేక్స్‌తో బాగానే సాగుతోంది. శంకర్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో కమల్‌తో ఇండియన్ 2 షూటింగ్ చుట్టేస్తున్నారు. రీసెంట్‌గానే కమల్ హాసన్ ఇండియన్ 2 రషెశ్ చూశాను.. చాలా బాగా వచ్చాయంటూ దర్శకుడు శంకర్‌కి విలువైన వాచ్ ప్రెజెంట్ చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో కాజల్ అగర్వాల్-రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక మిగతా నటుల వివరాలు అంతగా బయటికి రాకపోయినా.. ఇప్పుడు ఈ చిత్రంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బ్రహ్మానందం.. ఇండియన్ 2లో కామెడీ పాత్రకి ఎంపికయ్యారని అంటున్నారు. ఈ మధ్యనే రంగమార్తాండ చిత్రంలో తనలోని మరో కోణాన్ని పరిచయం చేసిన బ్రహ్మి.. కొన్నేళ్లుగా సినిమాలు చేయడం తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు వరస అవకాశాలతో బిజీగా మారారు. ఇండియన్ 2లో బ్రహ్మి అనే న్యూస్ చూడగానే కమల్‌తో బ్రహ్మి సీన్స్ ఎలా ఉండబోతున్నాయో అంటూ బ్రహ్మి ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అంతేకాదు.. బ్రహ్మానందం ఇండియన్ 2 లో నిజంగానే కామెడీ రోల్ చేస్తారా.. లేదంటే మరేదన్నా పాత్ర చేస్తున్నారా? అనే విషయంలోనూ చాలా క్యూరియాసిటీ కనిపిస్తోంది. మరో వైపు వడివేలుతో శంకర్‌కి పొసగదు కాబట్టే.. ఆ స్థానంలో బ్రహ్మానందాన్ని శంకర్ తీసుకుని ఉంటాడనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Brahmanandam in Shankar and Kamal Combo Film Indian 2:

Brahmanandam Plays Key Role in Indian 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ