Advertisementt

కొందరు దర్శకులు ఆమెని వాడుకున్నారట!

Sun 09th Jul 2023 01:54 PM
payal rajput,heroine,rx100,tollywood  కొందరు దర్శకులు ఆమెని వాడుకున్నారట!
Payal Rajput Sensational Comments on Directors కొందరు దర్శకులు ఆమెని వాడుకున్నారట!
Advertisement
Ads by CJ

RX 100 మూవీతో బోల్డ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ అప్పటినుండి ఇప్పటివరకు ఆమెకి ఆ స్థాయి హిట్ దక్కలేదనే చెప్పాలి. సీనియర్ హీరోలని నమ్ముకున్నా పాయల్ ఓ స్టేటస్‌ని మెయింటైన్ చేసేదే. కానీ పాయల్ ఇంకా గ్లామర్ రోల్స్ కోసమే ఎదురు చూస్తుంది. యంగ్ హీరో అవకాశాల కోసమే కాపు కాచుకుంది. కానీ పాయల్‌కి RX100 తర్వాత ఆ టైప్ సినిమాలే వచ్చాయి. రీసెంట్‌గా మాయాపేటిక మూవీలో నటించిన ఆమెకి ఆ సినిమా రిజల్ట్ కూడా నిరాశనే మిగిల్చింది.

ఇక RX100తో తనకి సక్సెస్ ఇచ్చిన అజయ్ భూపతిని నమ్మి మంగళవారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అయితే మాయాపేటిక ప్రమోషన్స్‌లో పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ దర్శకులపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. RX100 తర్వాత కొందరు డైరెక్టర్లు తనను మిస్ గైడ్ చేశారని చెప్పుకొచ్చింది. ఇక మరికొంత మంది డైరెక్టర్లు తనను వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ సినిమాకైనా నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెడతాను, కానీ ఆ సినిమాలు వర్కౌట్ అవ్వడం, కాకపోవడం నా చేతుల్లో లేదు. 

నా ఫస్ట్ సినిమా తర్వాత కొందరు డైరెక్టర్ల మిస్ గైడెన్స్ వల్ల నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఇక మరికొంతమంది నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్న విషయాన్ని నేను గుర్తించానని పాయల్ రాజ్ పుత్ సంచలనంగా మాట్లాడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఏ సినిమా చెయ్యాలనే నిర్ణయం తీసుకోవాలి అన్న విషయాల్లో మెచ్యూరిటీ వచ్చిందని వివరించింది.

Payal Rajput Sensational Comments on Directors:

They Used Me says Payal Rajput 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ