Advertisementt

Bro: పవన్ డ్యాన్స్ పిక్ వైరల్

Sun 09th Jul 2023 01:43 PM
pawan kalyan,bro the avatar,dance pic,jalsa  Bro: పవన్ డ్యాన్స్ పిక్ వైరల్
Pawan Kalyan Dance Pic From Bro Goes Viral Bro: పవన్ డ్యాన్స్ పిక్ వైరల్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వింటేజ్ పవన్ కళ్యాణ్‌గా Bro ద అవతార్‌లో చూపించబోతున్నట్లుగా సముద్రఖని బ్రో టీజర్‌లోనే ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేశారు. తమ్ముడు మూవీలోని లుక్ ఇంకా పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల లుక్స్‌ని తీసుకున్నారు. Bro ద అవతార్‌లో టైమ్‌గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబో సీన్స్‌లో ఇరగదీశారు. BRO టీజర్ చూశాక పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చేశాయి. తమిళ వినోదియం సీతం చిత్రానికి రీమేక్ అయినా.. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో BRO రూపు రేఖలన్నీ మారిపోయాయి.

100 పర్సెంట్ పవన్ కళ్యాణ్ మూవీగా BRO రాబోతుంది. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్‌లు ఐటెం పాప ఊర్వశి రౌతేల్లాతో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ సాంగ్‌లోని పవన్ స్టిల్‌ని సముద్ర ఖని షేర్ చేస్తూ.. Our #BRO in #BRO💪💪💪💪 అంటూ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయడానికి సిగ్గు పడినా.. ఆయన కాలు కదిపితే ఫ్యాన్స్‌కి ఊపొచ్చేస్తుంది. తాజాగా BRO లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జల్సా సినిమాలో సరిగమపదనిస పాటలో ఎలా అయితే కాలు ఎత్తుతాడో.. అదే తరహాలో పవన్ కళ్యాణ్ కాలు పైకెత్తి వేస్తున్న స్టెప్ అది.. ఈ పిక్ చూశాక పవన్ డ్యాన్స్‌ని ఊహించుకుని ఆయన ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా కేతికా శర్మ నటిస్తుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్‌ల ఐటెం సాంగ్ జూలై 3న రాబోతున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లీక్ చేసిన విషయం తెలిసిందే.

Pawan Kalyan Dance Pic From Bro Goes Viral:

Pawan Kalyan, Sai Dharam Tej Bro Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ