Advertisementt

యానిమల్ రీ షూట్ మోడ్

Sun 02nd Jul 2023 11:17 AM
animal  యానిమల్ రీ షూట్ మోడ్
Animal re-shoot mode యానిమల్ రీ షూట్ మోడ్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో తెలుగు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ షూటింగ్ రీసెంట్ గానే పూర్తయినట్లుగా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రణబీర్ కపూర్-రష్మిక కాంబోలో సందీప్ వంగా మాస్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీ ఆగష్టు లో విడుదల కావాల్సి ఉంది. రష్మిక యానిమల్ షూటింగ్ పూర్తి కావడంపై ఎగ్జైట్ అవుతూ పెద్ద పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తో టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళిన సందీప్ వంగా నుండి రాబోతున్నయానిమల్ పై అందరి లో భీభత్సమైన అంచనాలున్నాయి. 

అయితే ఆగష్టు లో విడుదల కావల్సిన యానిమల్ ఇప్పుడు అనుకున్న సమయానికి రావడం లేదు అనే టాక్ మొదలైంది. అయితే వేరే సినిమాల డేట్స్ క్లాష్ వాళ్ళో లేదంటే మరేదన్నానో కారణం కాదట. యానిమల్ లోని కొన్ని సీన్స్ సరిగ్గా రాని కారణంగా ముఖ్యంగా రణబీర్ కపూర్ పై కొన్ని సీన్స్ రీ షూట్ చెయ్యడానికి సమయం సరిపోదు, ముందు సీన్స్ కన్నా కాస్త బెటర్ గా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. 

అందుకే ఈ చిత్రాన్ని ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయమై మేకర్స్ నుండి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Animal re-shoot mode:

Animal out of August

Tags:   ANIMAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ