స్పై చిత్రం సక్సెస్ అవ్వకపోయినా.. అందులో నటించిన ఓ బ్యూటీకి ఏకంగా పవన్ కళ్యాణ్ OG లో ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది ఈ గురువారం బక్రీద్ స్పెషల్ గా విడుదలైన హీరో నిఖిల్-ఐశ్వర్య మీనన్ కలయికలో తెరకెక్కిన స్పై ని ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేదు. ప్రమోషన్స్ వీక్, ఏజెంట్ టైప్ లో ఉన్న స్పై కి పబ్లిక్ నుండి సో సో టాక్ వచ్చేసింది. అయితే ఈ చిత్రంలో అలా కనిపించి ఇలా మాయమైన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసిందట.
పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో దానయ్య తెరకెక్కిస్తున్న OG మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కన్ ఫామ్ అయ్యింది. ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కనిపిస్తుంది. అందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తమిళ నటులు అర్జున్ దాస్, శ్రీయ రెడ్డిలు కీలక పాత్రలకి ఎంపికవగా.. ఇప్పుడు ఐశ్వర్య మీనన్ ని కూడా తీసుకోబోతున్నారట. దానికి సంబందించిన ఫోటో షూట్ కూడా రీసెంట్ గానే పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఆమెకి చిన్న ఇచ్చేది చిన్న పాత్రే అని తెలుస్తుంది.
మరి OG లో చిన్న కేరెక్టర్ అయినా ఆమెకి ఛాన్స్ వస్తే ఆటోమాటిక్ గా పాపులర్ అవడం ఖాయం. పవన్ సినిమాలో ఛాన్స్ అంటే అంతేగా.. ప్రేక్షకులకి త్వరగా రిజిస్టర్ అవుతారు. మరి అలా ఐశ్వర్య మీనన్ తెలుగులో ఇంకా ఇంకా ఛాన్సెస్ పట్టేస్తుందేమో చూద్దాం.