Advertisementt

ప్రాజెక్ట్ K సైడ్ అవుతుందా?

Sat 01st Jul 2023 11:23 AM
hanu man  ప్రాజెక్ట్ K సైడ్ అవుతుందా?
Will Project K release date change? ప్రాజెక్ట్ K సైడ్ అవుతుందా?
Advertisement
Ads by CJ

ప్రాజెక్ట్ జనవరి 12 2024 రిలీజ్ అంటూ మేకర్స్ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ K ని నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మార్కెట్ లోకి దించబోతున్నారని తెలుస్తోంది. కమల్ హాసన్ లాంటి టాప్ నటులు, అమితాబ్ లాంటి క్రేజీ స్టార్స్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవడంతో ఇప్పుడు ప్రాజెక్ట్ K పై అంచనాలు డబుల్ అయ్యాయి. సూపర్ మ్యాన్ తరహాలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతున్న ప్రాజెక్ట్ ఇప్పుడు అనుకున్న తేదికి వచ్చే ఛాన్స్ లేదా..

మొన్నీమధ్యనే తమ్మారెడ్డి భరద్వాజ ప్రాజెక్ట్ K గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎలా ఉన్నాయో.. మొదటి రోజు ఓపెనింగ్స్ 500 కోట్లు ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటూ మాట్లాడిన ఆయన ప్రాజెక్ట్ K నాకున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. ఆయన అన్నది నిజమయ్యేలా ఉంది ప్రస్తుతం చూస్తుంటే. కారణం.. అదే జనవరి సంక్రాంతి సమయంలో రవితేజ, మహేష్ బాబు.. ఇప్పుడు కొత్తగా తేజు సజ్జా హనుమాన్ రిలీజ్ కి డేట్స్ ఇచ్చేసారు. మహేష్ గుంటూరు కారం ఆదే సంక్రాంతికి రాబోతుంది. ఆయనంటే సూపర్ స్టార్ ప్రభాస్ తో పోటీ పడతారు. కానీ రవితేజ డేరింగ్ గా ఆయన ఈగల్ డేట్ ఇచ్చారు.

ఇప్పుడు ప్రశాంత్ వర్మ-తేజ సజ్జల హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12 న రాబోతుంది అంటూ డేట్ అనౌన్స్ చేసారు. ప్రాజెక్ట్ K రావడం లేదనే పక్కా సమాచారంతోనే వీరు ధైర్యంగా డేట్స్ లాక్ చేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో కాదు ముఖ్యంగా ప్రభాస్ ఫాన్స్ లో మొదలైపోయాయి.

Will Project K release date change?:

Hanu Man releasing on Jan 12th 2024

Tags:   HANU MAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ