Advertisementt

అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఓ భారీ ప్రాజెక్ట్

Sat 01st Jul 2023 10:30 AM
allu arjun,trivikram  అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఓ భారీ ప్రాజెక్ట్
Allu Arjun-Trivikram is a huge project అల్లు అర్జున్-త్రివిక్రమ్ ఓ భారీ ప్రాజెక్ట్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-త్రివిక్రం కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో మూవీస్ మూడు వేటికవే ప్రత్యేకం. అందుకే వారి నుండి ఎలాంటి ఎనౌన్సమెంట్ వచ్చిన సూపర్ క్రేజీగా వైరల్ అవుతుంది. ఇప్పుడు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ ఫ్యాన్ ఇండియా స్టయిల్లో ఉండబోతుంది అనే న్యూస్ అల్లు ఫాన్స్ ని నిలవనియ్యడం లేదు. పుష్ప ద రూల్ తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా మూవీని అఫీషియల్ గా ప్రకటించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ మూవీ త్రివిక్రమ్ తోనే ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఒకవేళ పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సెట్స్ మీదకి వెళ్ళినా ఆశ్చర్య పోవక్కర్లేదు అనేది కూడా  ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. గీత ఆర్ట్స్-హరిక అండ్ హాసిని కలయికలో తెరకెక్కనున్న ఈప్రాజెక్టు అతి భారీ ప్రాజెక్ట్ గా ఉండబోతుంది అని.. ఈ మూవీతోనే తివిక్రమ్ ప్యాన్ ఇండియా ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. మహేష్ మూవీ షూటింగ్ కి గ్యాప్ లు రావడంతో త్రివిక్రమ్ మధ్య మధ్యలో అల్లు అర్జున్ ని మీటవుతూ ఈ కథపైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఈసారి భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పుడు మహేష్ తోనూ గుంటూరు కారంలో యాక్షన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా.. అల్లు అర్జున్ తో చేయబోయేది మాత్రం ఫుల్ ఆన్ యాక్షన్ మూవీగా చెయ్యాలనుకుంటున్నారట. నార్త్ లో నిలబడాలంటే యాక్షన్ ఉండాల్సిందే. ఇప్పుడు అదే బేస్ మీది త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలయిక మూవీ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక వీరి కాంబోపై నేడో.. రేపో అనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉందట.

Allu Arjun-Trivikram is a huge project:

Allu Arjun, Trivikram collaborates once again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ